July 28, 2025 8:06 am

Email : bharathsamachar123@gmail.com

BS

మౌనం.. ఇప్పుడు అన్నింటికి ఇదే సమాధానం

భారత్ సమాచార్, ఫిలాసఫీ:  కోపము – మౌనం ఇవి చిన్నవిగా కనిపించినా ఒకటి పెద్ద ప్రళయాన్ని సృష్టిస్తే మరోకటి ఆ ప్రళయం నుండి కాపాడుతుంది.. నీ తప్పు లేనపుడు నువ్వు కోపానికి, ఆవేశానికి గురి కావాల్సిన అవసరం లేదు.. నీ తప్పు ఉన్నపుడు కోపానికి గురయ్యే అర్హత నీకు లేదు.. ఎలా చూసినా మౌనమే సరైన పరిష్కారం అని తెలుస్తుంది.. దేనికీ లొంగని ఇనుము కూడా చల్లగా ఉన్నపుడు దృఢముగా ఉండి, వేడి చేసినపుడు ముద్దగా మారి బలహీనం అయిపోతుంది. అలానే కోపం చెందినపుడల్లా మనస్సు బలహీనమై మరిన్ని కొత్త సమస్యలను తెచ్చి పెడుతుంది.. మౌనముగా ఉన్నపుడే మనసు దృఢముగా ఉంటుంది. సమస్యల పరిష్కారానికి ప్రశాంతమైన వాతావరణంను కల్పిస్తుంది.. కనుక కోపం వచ్చినపుడు మౌనం పాటించండి.. అధికశాతం సమస్యలు అక్కడే పరిష్కారం అవుతాయి. అంతే కానీ కోపం వచ్చింది కాద అని చూపించి..ఇతరులను బాధ పెట్టి..తరువాత నువ్వు బాధపడితే. ఫ్యామిలి సంబంధాలు, బంధాలు, బంధుత్వాలు దెబ్బతింటాయి. క్షణికావేశంలో చూపించే కోపం చాలా పరిణామాలకు దారి తీస్తుంది. కాబట్టి ఏం జరిగినా కొంచెం సేపు మౌనంగా ఉండండి అంతే అన్ని సమస్యలు అవే తీరిపోతాయి. మన తాతలు, నాన్న కాలంలో కోపాలు తాపాలు కొంత కాలమే ఉండేవి తరువాత అందరూ కలిపోయేవారు. కానీ ఇప్పుడు అలా బాధపెట్టే చిన్న మాటలను కూడా అవతలి వారు అంగీరించడం లేదు. దీంతో కుటుంబాలే కూలిపోతున్నాయి. మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. అంతుకే మారుతున్న కాలానికి అనుగుణంగా మనం మౌనంగా ఉంటేనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.

మౌనం అన్నింటికి అర్థాంగికారం ఒకప్పటి మాట
మౌనం అన్ని సమస్యలకు పరిష్కారం నేటి మాట.

మరిన్ని కథనాల కోసం క్లిక్ చేయండి

ప్రేమ.. ద్వేషం అంతా యాదృచ్ఛికమే

Share This Post
error: Content is protected !!