భారత్ సమాచార్.నెట్: ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) ఈ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. పహల్గాం (Pahalgam) ఉగ్రదాడికి (Terror attack) ప్రతీకారంగా భారత్ మే 7న ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పేరిట పాక్ ఉగ్రశిబిరాలపై దాడి చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. భారత్ చేపట్టిన ఈ చర్యపై దేశ వ్యాప్తంగానే కాకుండా పలు దేశాలు సైతం మద్దతు తెలిపాయి. కొందరైతే తమకు కొత్తగా జన్మించిన కుమార్తెలకు సింధూర్ (Sindoor) అని పేరు పెట్టి సైనిక జవాన్ల పట్ల తమకున్న గౌరవాన్ని చాటుకుంటున్నారు.
ఉత్తర్ ప్రదేశ్‌లోని కుషీనగర్ జిల్లాలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం రెండు రోజుల వ్యవధిలో 17 మంది ఆడ శిశువులకు వారి కుటుంబ సభ్యులు సింధూర్ అంటూ నామకరణం చేశారు. ఆపరేషన్ సింధూర్ తమ జీవితాల్లో ఎంతటి ప్రాముఖ్యత సంతరించుకుందో చాటుకుందని.. సింధూర్ అనేది ఇప్పుడు కేవలం ఒక పేరు కాదని, ఒక భావోద్వేగానికి దేశం పట్ల గౌరవానికి ప్రతీక అని పలువురు పేర్కొంటున్నారు.
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్ సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట దాడులకు దిగింది. మే 7న అర్థరాత్రి పీవోకేతో పాటు, పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపింది. ఈ దాడుల్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. కాగా ఇరు దేశాలు ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
Share This Post