భారత్ సమాచార్.నెట్: ఏపీ డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ హరి హర వీరమల్లు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరెకెక్కిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. బాబీ డియోల్ వంటి బాలీవుడ్ స్టార్ కీలక పాత్ర పోషించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 24న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌తో దూసుకెళ్తోంది.
అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త వైరల్ మారింది. మూవీలోని కొన్ని సన్నివేశాల్లో VFX సరిగా లేవంటూ అభిమానులు, ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హరి హర వీరమల్లు VFX విషయంపై నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని.. కొన్ని సన్నివేశాలను తొలగించినట్లు తెలుస్తోంది.
మూవీలో పవన్ కళ్యాణ్ అతని అనుచరులు కొండ అంచున గుర్రాలపై స్వారీ చేసే సన్నివేశాలను తగ్గించారు. అలాగే ఫ్లాగ్ సన్నివేశాన్ని పూర్తిగా తొలగించారు. పవన్ బాణాలు సంధించే సీన్‌లో కొన్ని మార్పులు చేశారు. ఇలా కొన్ని సన్నివేశాలు తగ్గించడం.. తొలగించడంతో మూవీ 15నిమిషాల వరకు నిడివి తగ్గింది. ప్రస్తుతం థియేటర్లలో ఎడిటెడ్ వెర్షనే ప్లే అవుతోంది. ఇక ఈ మార్పులు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి టాక్‌ను తీసుకువస్తోందో చూడాలి మరి.