August 5, 2025 12:03 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

MK Stalin: పిల్లలకు తమిళ పేర్లు.. ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించనున్న స్టాలిన్ ప్రభుత్వం 

భారత్ సమాచార్.నెట్: పిల్లలకు పేర్లు (Children Names) పెట్టేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ (Websites)ను ప్రారంభించనున్నట్లు తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) ప్రకటించారు. ఈ వెబ్‌సైట్‌లో అర్థాలతో కూడిన తమిళ పేర్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇందుకోసం తమిళ అభివృద్ధి శాఖ, తమిళ వర్చువల్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ వెబ్‌సైట్‌ను రూపొందించనున్నారు. ఇటీవల డీఎంకే ఎమ్మెల్యే వేలు కుమార్తె వివాహ వేడుకకు హాజరైన స్టాలిన ఈ విషయాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ..  దయచేసి మీ పిల్లలకు అందమైన తమిళ పేర్లు పెట్టండి. అది నా హృదయపూర్వక విజ్ఞప్తి అని తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఓ వినియోగదారుడు స్పందిస్తూ.. చాలా మంది తమిళ తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి తమిళ పేర్లు పెట్టాలని అనుకున్నా.. వాటికీ అర్థ వివరణలు తెలుసుకునేందుకు సరైన వెబ్ సైట్లు అందుబాటులో లేవు. దీనికోసం ప్రభుత్వం తమిళ పేర్లు, వాటి అర్థాలతో కూడిన ఒక వెబ్‌సైట్ రూపొందిస్తే బాగుంటుంది అంటూ ప్రభుత్వాన్ని ట్యాగ్ చేశాడు.
దీనిపై స్పందించిన స్టాలిన్.. అర్థంతో కూడిన అందమైన తమిళ పేర్ల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను తమిళ వర్చువల్ అకాడమీ ద్వారా ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై తమిళనాడు ప్రజల నుంచే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సంఘాల హర్షం వ్యక్తం చేశాయి. పేర్లు కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదు, అవి భాషా వారసత్వానికి ప్రతీకగా నిలుస్తాయి. చిన్ననాటి నుంచే మాతృభాష పట్ల గౌరవాన్ని పెంపొందించేందుకు ఇది మంచి ప్రయత్నమని భాషా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Share This Post