July 30, 2025 5:12 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

Sreeleela: శ్రీ లీల బర్త్ డే స్పెషల్.. బ్యాక్ టు బ్యాక్ పోస్టర్స్ రిలీజ్

భారత్ సమాచార్.నెట్: శ్రీలీల (Sreeleela).. టాలీవుడ్ (Tollywood) టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ ఉంది. పెళ్లి సందడి (Pelli Sandadi) సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన ఈ భామ తన అందం, నటన, ఎనర్జీతో ఎంతో తక్కువ సమయంలోనే ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం శ్రీలీల చాలా బీజీగా ఉంది. ఆమె చేతిలో అర‌డ‌జ‌ను పైగా సినిమాలు ఉన్నాయి. ఈరోజు శ్రీలీల పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకి ప్రముఖులు, నెటిజన్స్ బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆమె నటిస్తున్న రెండు భారీ చిత్రాల నుంచి ప్రత్యేక పోస్టర్లు విడుదల చేశారు మేకర్స్. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సింగ్ చిత్ర బృందం ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా బర్త్ డే విషెస్ తెలిపింది. ఈ పోస్టర్‌లో శ్రీలీల చాలా క్యూట్‌గా కనిపిస్తోంది. చేతిలో కాఫీ క‌ప్ ప‌ట్టుకుని నిలుచొని సింపుల్ లుక్‌తో అద‌ర‌గొడుతుంది. శ్రీలీల లుక్ త‌న అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఇటీవ‌లే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సెట్‌లో అడుగుపెట్టగా.. ఆయ‌న‌తో పాటు శ్రీలీల కూడా జాయిన్ అయింది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.
మరోవైపు మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మాస్ జాతార’ సినిమా నుంచి కూడా ఆమె పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ విడుదలైంది. ఇందులో శ్రీలీల సంప్రదాయ వేషధారణలో దర్శనమిస్తూ అభిమానుల మనసులు గెలుచుకుంది. ఈ సినిమాలో ఆమె పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేకపోయినప్పటికీ, పోస్టర్ చూసిన వెంటనే ఆమె పాత్ర పట్ల ఆసక్తి పెరిగింది. ఈ రెండు పోస్టర్లు ఒకేసారి పుట్టినరోజు సందర్భంగా విడుదల కావడం, శ్రీలీల అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది. కాగా అఖిల్ స‌ర‌స‌న ‘లెనిన్‌’, త‌మిళంలో శివ కార్తికేయ‌న్ స‌ర‌స‌న ‘ప‌రాశ‌క్తి’, హిందీలో కార్తీక్ ఆర్యన్‌కు జోడీగా ‘ఆషిఖి 3’, కిరీటి రెడ్డి హీరోగా తెలుగు, క‌న్నడ ద్విభాషా చిత్రం ‘జూనియ‌ర్’ చిత్రాల్లో శ్రీలీల న‌టిస్తోంది.
Share This Post