భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా ;
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్.ఎస్.సీ) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కి తాజాగా 2024 జూన్ లో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా మొత్తం 17,727 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులకి కచ్చితంగా ఏదైనా ఒక డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు కచ్చింతం 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు వయస్సు సడలింపు అవకాశం ఉంది. పూర్తి వివరాలను ఎస్.ఎస్.సీ అధికారిక వెబ్సైట్ ను ద్వారా తెలుసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. రెండు దశల్లో రాత పరీక్షను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేయటానికి చివరి తేదీ 24.07.24.
భర్తీ చేసే ఉద్యోగాల వివరాలు : అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ , ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్, రీసెర్చ్ అసిస్టెంట్, జూనియర్ స్టాటికెల్ ఆఫీసర్స్, జూనియర్ ఇంటలిజెన్స్ ఆఫీసర్స్, పోస్టల్ అసిస్టెంట్స్, సార్టింగ్ అసిస్టెంట్స్, అప్పర్ డివిజనల్ క్లర్క్స్, టాక్స్ అసిస్టెంట్స్.