భారత్ సమాచార్, యాదాద్రిభువనగిరి: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మద్దతుగా నిలవాలని, సీఎం కేసీఆర్‌తోనే ప్రజాసంక్షేమం సాధ్యమని JYG ఫౌండేషన్ అధినేత, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు జడల యశీల్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ముత్తిరెడ్డిగూడెం గ్రామనికి చేదిన 50మంది యువకులు BRS పార్టీలో చేరారు. వీరికి జడల యశీల్ గౌడ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బీఆర్ఎస్ తోనే సంక్షేమం సాధ్యం…
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు, భువనగిరి శాసనసభ్యులు పైల్ల శేఖర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై BRSలో చేరినట్లు తెలిపారు. BRS పార్టీలో చేరిన వారిలో గజ్జి నర్సింహా, మెరుగు నర్సింహా, మాకోళ్ళ కనకరాజు, నోముల శివ, కూకుట్ల శ్రీకాంత్, వద్ది లింగస్వామి, పుల్లెల భరత్, మాకొళ్ల వేణు, మాకొళ్ళ మణికంఠ, అల్లం నందకిషోర్, కొండ మధు, గంధమల్ల శ్రీకాంత్, పుల్లెల భాస్కర్, నోముల సురేశ్, ఎడ్ల ప్రమోద్, వద్ది బాలకృష్ణ, కొండమడుగు వంశీ, ఎంకర్ల నవీన్, పల్లేపటి వర్ధన్, కొండమడుగు మున్న, మాకోళ్ల భాను, పులకరం శ్యామ్, పిన్నింటి మధు, కొండ మహేష్, ఎశమైన రాజు, గడ్డం చానిక్య, కొండమడుగు కార్తీక్, కర్రే చరణ్, శ్రీకాంత్, జశ్వంత్ ఉన్నారు. కార్యక్రమంలో గ్రామ శాఖ బీఆర్ఎస్ అధ్యక్షులు గౌటి సతీష్, గ్రామ BRS యూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.