భారత్ సమాచార్ ; ‘ఆయ్’ చిత్రం నుంచి సూఫియానా అనే ప్రేమ గీతాన్ని విడుదల చేశారు దర్శకనిర్మాతలు. మేం ఫ్రెండ్సండి… అనేది ట్యాగ్ లైన్. హీరో నార్నే నితిన్ ప్రేయసి వెనుక పడుతూ ఆలపిస్తున్నాడు ఈ గీతాన్ని. ప్రేయసి కోసం ప్రియుడు పాడే పాట హుషారుగా సాగుతోంది. సూఫియానా.. గెండెల్లోనా ప్రేమ వానా వంటి క్యాచీ లైన్స్ అందించాడు రచయిత శ్రీమణి. రామ్ మిరియాల సంగీతం సమకూర్చి, సమీర భరద్వాజ్ , రమ్యాలతో పాటుగా గీతాన్ని ఆలపించాడు. నయన్ కథానాయిక, బన్ని వాస్ నిర్మాత. అంజి దర్శకుడు. ఈ వేసవికి ప్రేక్షకులకు వినోదాలు పంచటానికి ‘ఆయ్’ సిద్ధమవుతోంది.
Share This Post