భారత్ సమాచార్.నెట్, పార్వతీపురం మన్యం: కుటుంబ కలహాలతో ఓ యువకుడు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన సీతంపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతంపేటకు చెందిన నల్లాన శివకుమార్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులతో చిన్నపాటి ఘర్షణ పడ్డాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై క్షణికావేశంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు వెంటనే గుర్తించి స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే శివ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వై. అమ్మనరావు తెలిపారు. మృతుడికి గతేడాదే వివాహమైంది. యువకుడి మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని కథనాలు