Homebreaking updates newsఏపీ సీఎం పై సుప్రీం కోర్టు ఆగ్రహం

ఏపీ సీఎం పై సుప్రీం కోర్టు ఆగ్రహం

భారత్ సమాచార్, దిల్లీ ;

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తిరుమల లడ్డూ వ్యవహారమే హాట్ టాపిక్. గత కొన్ని రోజులుగా దీనిపై దేశ వ్యాప్త చర్చ కూడా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం సుప్రీం కోర్టు మెట్లు కూడా ఎక్కింది. ఈ వ్యవహారంపై తాజాగా దేశ అత్యున్నత న్యాయ స్థానం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమల లడ్డూలలో జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యి వాడారంటూ వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ‘కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారంలో ఆధారాలు లేకుండా, రెండో అభిప్రాయం తీసుకోకుండా పబ్లిక్ మీటింగ్లో ఎలా మాట్లాడారు? లడ్డూలను టెస్టులకు పంపారా? ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించినప్పుడు బహిరంగ ప్రకటన చేయాల్సిన అవసరం ఏముంది?’ అని ప్రభుత్వ లాయర్ ను కోర్టు ప్రశ్నించింది.

లడ్డూ వివాదంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరును సుప్రీం కోర్టుఆక్షేపించింది. ‘ఈ వివాదంపై సెప్టెంబర్ 18వ తేదీన ముఖ్య మంత్రి ప్రకటన చేశారు. సెప్టెంబర్ 25వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదైంది. సెప్టెంబర్ 26వ తేదీన సిట్ ఏర్పాటైంది. విచారణ పూర్తవ్వకముందే మనోభావాలు దెబ్బతీసేలా మీడియా ముందు ప్రకటన చేయాల్సిన అవసరం ఏముంది’ అని ప్రశ్నించింది. లడ్డూలు రుచిగా లేవని భక్తులు ఫిర్యాదు చేశారని టీటీడీ లాయర్ పేర్కొన్నారు. మరి ఆ లడ్డూలను పరీక్షలకు పంపారా? అంటూ కోర్టు నిలదీసింది.

మరికొన్ని వార్తా విశేషాలు

నిందితులుగా ముగ్గురు ఐపీఎస్ అధికారులు…

RELATED ARTICLES

Most Popular

Recent Comments