Homemain slidesఎస్సీ, ఎస్టీ ఉపవర్గీకరణకు ‘సుప్రీం’ సిగ్నల్

ఎస్సీ, ఎస్టీ ఉపవర్గీకరణకు ‘సుప్రీం’ సిగ్నల్

భారత్ సమాచార్, జాతీయం ;

షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేపట్టేందుకు రాష్ట్రప్రభుత్వాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు తాజాగా తీర్పు నిచ్చింది. ఎస్సీలు చాలా వెనుకబడిన వర్గాలుగా ఉన్నట్లు ఆధారాలున్నాయని.. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ ఆవశ్యకత ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. కొన్ని కులాల్లో వర్గీకరణ చేసే చేసే వెసులుబాటు రాష్ట్రాలకు ఉండాలని ఎస్సీ వర్గీకరణపై చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అవసరమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తితో తీర్పు వెలువరించింది. వర్గీకరణను జస్టిస్‌ బేలా త్రివేది వ్యతిరేకించారు. అయితే, ఉపవర్గీకరణ చేపట్టే రాష్ట్రాలు- అందుకు సహేతుక కారణాలు చూపాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం బీసీ కులాలకు కోటాలు వున్నట్లుగా.. షెడ్యూల్ కులాల్లో కోటా అమలు దిశగా అడుగులు పడుతుంది. త్వరలో క్రిమీ లేయర్ విధానం కూడా అమలు చేసే అవకాశం ఉంటుంది.

రిజర్వేషన్లను అమలు చేస్తాం… తెలంగాణ సీఎం రేవంత్

”ఎస్సీ, ఎస్టీ ఉపవర్గీకరణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించింది. వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాం. కోర్టు తీర్పుకు అనుగుణంగా ఏ,బీ,సీ,డీ వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది. ఇప్పుడు అమలులో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా మాదిగ, మాదిగ ఉప కులాలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం అవసరమైతే కొత్త ఆర్డినెన్స్ ను తీసుకొస్తాం” అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

 క్రింది కులాలు షెడ్యూల్ కులాలుగా వున్నాయి…

ఆది ఆంధ్ర
ఆది ద్రవిడ
అనాముక
అరెమాల
అరుంధతీయ – తోలుపని
అరవమాల
బారికి – గ్రామ కాపరి, బోయీ
బావురి – బుట్టలతయారీ
బేడజంగం, బుడగ జంగం
బైండ్ల – మాదిగల పౌరోహిత్యం, మైసమ్మ మారెమ్మలను మేల్కొల్పటం
బ్యాగరి, బ్యాగర – కాటికాపరి, నేతపని
చాచాతి – పండ్లు పూలు అమ్మటం, పాకీపని
చలవాది – గ్రామకాపరి, డోలువాయించటం
చమర్, మోచి ముచ్చి, చమర్ రవిదాస్, చమర్ రోహిదాస్ – తోలుపని
చంభర్ – తోలుపని
ఛండాల
డక్కలి, డొక్కలవారు – మాదిగల వంశవృక్షాలు కథాగానం చేయటం, తోలుపని
దండాసి – గ్రామకాపరి
ధోర్ – తోలుపని
దోమ్, దొంబర, పైడి, పానో – నేతపని, సంగీతం, డోలు, గూలకాపరి పని
ఎల్లమ్మవారు, యెల్లమ్మవాండ్లు
దూసి, హడ్డి, రెల్లి, చాచండి – పండ్లు పూలు అమ్మటం, పాకీపని
గొడగాలి, గొడగుల – బుట్టలతయారీ
గొడారి – తోలుపని
గోసంగి -పశుసంరక్షణ, వ్యవసాయం, రాజులవద్ద యుద్ద సైనికులు, ప్రస్తుతం గ్రామ సుంకరి
హొలయ – నేతపని
హొలేయదాసరి – పౌరోహిత్యం
జగ్గలి – తోలుపని
జాంభవులు – తోలుపని
కొలుపులవాండ్లు, పంబడ, పంబండ, పంబల – సోదె చెప్పటం, నాట్యం, మేళం, ఎల్లమ్మ, ముత్యాలమ్మలను మేల్కొల్పటం
మదాసికురువ, మదారికురువ – గొర్రెలకాపరులు
మాదిగ
మాదిగదాసు, మాదిగమస్తు
మహర్ – నేతపని
మాల – ముతక వస్త్రాలు నేతపని, గ్రామకాపరి, వ్యవసాయకూలి,
మాలదాసరి
మాలదాసు – పౌరోహిత్యం
మాలహన్నాయి – దిమ్మర్రులు
మాలజంగం – పౌరోహిత్యం
మాలమస్తి – దొమ్మరి విద్య
మాలసాలె, నేతకాని -నేతపని /ముతక వస్త్రాలు , నీరటి, సుంకరి
మాలసన్యాసి – భిక్షాటన
మాంగ్ – పాములు పట్టటం, డోలువాయించటం
మాంగ్ గరోడి – గేదెలకుక్షౌరం చేయటం, చాపలు తయారీ
మన్నె – వ్యవసాయకూలి
మష్తి
మాతంగి – పాటలుపాడుతూ బిక్షాటన
మెహ్తార్ – పాకీపని
మిత్తుల అయ్యవారు – మాల పురోహితులు
ముండల – నేతపని
పాకి, మోటి, తోటి
పామిడి – నేతపని
పంచమ, పెరయ
రెల్లి – పండ్లు పూలు అమ్మటం, పాకీపని
సమగర – తోలుపని
సంబాస్ – బొందలు తవ్వటం, రండోలువాయించటం
సప్ర – పండ్లు పూలు అమ్మటం, పాకీపని
సిందోళ్ళు, చిందోళ్ళు – నాటకాలు, నాట్యం
యాతాట
వల్లువన్

మరికొన్ని వార్తా విశేషాలు…

భారత్ లో నిరుద్యోగానికి మరో ఉదాహరణ

RELATED ARTICLES

Most Popular

Recent Comments