భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: ఓటీటీ (OTT), సోషల్ మీడియాల్లో (Social Media) ప్రసారమవుతున్న అశ్లీల కంటెంట్‌ను నిషేధించాలని కోరుతూ ఇటీవల సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్ (Petition) దాఖలైంది. తాజాగా దీనిపై జస్టిస్( Justice) బీఆర్ గవాయ్ (BR Gavai), అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో (Augustine George Masih) కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై స్పందన తెలియజేయాలని కోరుతూ కేంద్రం(Central Govt)తో పాటు పలు ఓటీటీ, సోషల్ మీడియా సంస్థలకు సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
ఓటీటీ, సోషల్ మీడియాలో లైంగికంగా అసభ్యకరమైన కంటెంట్‌ను నిషేధించేందుకు.. కట్టడి చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని.. ఇందుకోసం ఒక జాతీయ కంటెంట్ నియంత్రణ అథారిటీని ఏర్పాటు చేయాలని ఐదుగురు పిటిషనర్లు ధర్మాసానికి విజ్ఞప్తి చేశారు. కఠిన నియమాలు లేకపోవడంతో వల్లే ఆన్‌లైన్‌లో జుగుప్సాకరమైన కంటెంట్ పుట్టుకొస్తుందని పిటీషన్లరు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించగా.. పిటీషనర్ల తరఫున అడ్వకేట్ విష్ణు శంకర్ జైన వాదించారు.
ఇలాంటి అభ్యంతరకరమైన కంటెంట్ వల్ల కేవలం పిల్లలు, యువత మాత్రమే కాకుండా పెద్దల ఆలోచనలు కూడా కలుషితం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది సమాజంలో వికృత పోకడలకు, అసహజ లైంగిక ధోరణులకు దారితీసే ప్రమాదం ఉందని పేర్కొంది. తద్వారా దేశంలో నేరాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. సెక్సువల్ కాంటెంట్ అంశంలో ప్రభుత్వమే ఏదైనా చేయాలని సుప్రీం ధర్మాసనం తుషార్ మెహతాను కోరింది. మరోవైపు కేంద్రంతో పాటు ఎక్స్ కార్పొరేషన్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, ఉల్లు డిజిటల్, ఆల్ట్‌బాలాజీ, ఎంయూబీఐ, గూగుల్, యాపిల్, మెటా సంస్థలకు కూడా సుప్రీం నోటీసులు ఇచ్చింది.
Share This Post