July 28, 2025 7:57 am

Email : bharathsamachar123@gmail.com

BS

Supreme Court: ఆరు రోజుల్లో ఉరిశిక్ష.. సుప్రీంకు చేరిన నిమిష ప్రియ కేసు!

భారత్ సమాచార్.నెట్: కేరళకు చెందిన నిమిష ప్రియా మరో రెండు రోజుల్లో యెమెన్ దేశంలో ఉరికంబం ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. యెమెన్ దేశంలోని తన వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో నర్సు నిమిష ప్రియకు అక్కడి చట్టాల ప్రకారం ఉరిశిక్ష విధించారు.  ఈ శిక్షను జూలై 16న అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే నిమిష ప్రియా వ్యవహారం దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చేరింది.
నిమిష ప్రియను ఉరిశిక్ష నుండి రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం దౌత్యపరంగా జోక్యం చేసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఉరి శిక్షకు రెండు రోజుల ముందు అంటే జూలై 14న ఈ పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం విచారించనుంది. నిమిష ప్రియా ఉరిశిక్షపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతూ సీనియర్ న్యాయవాది ఆర్ రాజేంత్ బసంత్ పిటిషన్ దాఖలు చేశారు. జూలై 16న ఉరిశిక్ష అమలుకావడంతో దౌత్య చర్చలకు రెండు రోజులే సమయం ఉంటుందని.. తక్కువ సమయంలో తీవ్రమైన పరిణామాలు సాధ్యం కావని.. ఈ పిటిషన్‌పై త్వరగా విచారణ జరపాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు.
అయితే షరియత్ చట్టాల ప్రకారం బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లిస్తే నిమిష ప్రియకు విముక్తి లభించే అవకాశం ఉందని కూడా ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కాగా, పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిష ప్రియ నర్సింగ్ కోర్స్ చేసి 2008లో యెమెన్ వెళ్లి అక్కడ ఓ క్లినిక్ ఓపెన్ చేశారు. తన వ్యాపార భాగస్వామితో వేధింపులు మొదలవ్వడంతో.. 2017లో తన వ్యాపార భాగస్వామికి మత్తుమందు ఇచ్చింది. మత్తుమందు అధిక మోతాదు వల్ల అతడు చనిపోవడంతో కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది.
Share This Post
error: Content is protected !!