భారత్ సమాచార్.నెట్: తమిళ్ స్టార్ హీరో సూర్య భార్య జ్యోతికతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య.. కాస్త విరామం తీసుకుని భార్యతో ఈస్ట్ ఆఫ్రికాలోని సీషెల్స్ అనే అందమైన ఐలాండ్‌లో విహరిస్తున్నారు. ఆ ప్రాంతంలో సముద్రంతో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది ఈ బ్యూటిఫుల్ జంట. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సూర్య భార్య జ్యోతిక సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
‘స్వర్గంలో మరో రోజు మనిద్దరం’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ క్యాప్షన్ జోడించారు జ్యోతిక. ఈ పిక్స్, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు సూర్య-జ్యోతిక జంటపై క్యూట్, బ్యూటిఫుల్ కపుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫోటోల్లో సూర్య గ్రే హెయిర్ గడ్డంతో న్యూ లుక్‌లో కనిపించారు. దీంతో ఇది నెక్స్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన లుక్ అంటూ ప్రచారం మొదలైంది.
ఇకపోతే నటుడు సూర్యకు తమిళ ఫ్యాన్స్‌తో పాటు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. గజిని సినిమాతో తెలుగులో ఆకట్టుకున్న సూర్య.. వరుసగా డిఫరెంట్ పాత్రల్లో నటించి అందరినీ మెప్పించాడు. సినిమా పరిశ్రమలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోలో తను ఒక్కడు. ప్రస్తుతం సూర్య వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్ టైనమెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాతో పాటు సూర్య ఆర్జే బాలాజీ డైరెక్షన్‌లో కరుప్పు సినిమాలోనూ నటిస్తున్నారు.