భారత్ సమాచార్.నెట్: మంచు విష్ణు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించి, నటించిన చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రంపై ప్రముఖ తమిళ నటుడు సూర్య ప్రశంసలు కురిపించారు. సినిమా విజయం సాధించిన సందర్భంగా మంచు విష్ణుకు ప్రత్యేక విషెస్ చెప్పారు సూర్య. ఈ సందర్భంగా మంచు విష్ణుకు సూర్య ఓ పూల బొకేతో పాటు అభినందన సందేశం పంపారు. ఈ అద్భుతమైన మైలురాయికి బిగ్ కంగ్రాచ్యులేషన్స్ బ్రదర్ అంటూ సూర్య విష్ చేశారు.
మీ కష్టం, నమ్మకం ఫలించాయి. ఎన్నో హృదయాలను హత్తుకునే సినిమా తీసినందుకు మీ పట్ల గర్వంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నాను అని సూర్య తన సందేశంలో పేర్కొన్నారు. సూర్య అభినందనలపూ మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బిగ్ బ్రదర్ సూర్య! మీ సందేశానికి ధన్యవాదాలు. స్ఫూర్తి కోసం నేను ఎప్పుడూ మీ సినిమాలనే చూస్తాను. మీ నుంచి ఇలాంటి సందేశం రావడం నాకు దక్కిన అతిపెద్ద గౌరవాల్లో ఒకటి. లవ్ మై బిగ్ బ్రదర్ అంటూ విష్ణు బదులిచ్చారు.
మరోవైపు కన్నప్ప చిత్రం పైరసీకి గురికావడంపై మంచు విష్ణు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు పైరసీని ప్రోత్సహించొద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 30,000 పైగా చట్టవిరుద్ధమైన లింకులను తమ టీమ్ తొలగించిందని.. ఈ పైరసీ విషయంలో ఎంతో బాధగా ఉందన్నారు. పైరసీ అనేది దొంగతనంతో సమానం.. దయచేసి దానిని ప్రోత్సహించకండి.. సరైన మార్గంలో సినిమాను ఆదరించండి అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.