భారత్ సమాచార్, అమరావతి ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ‘స్వర్ణ గ్రామపంచాయతీ’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలకు ప్రభుత్వం తాజాగా శ్రీకారం చుట్టింది. ఆయా గ్రామాల సర్పంచుల అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కోనసీమ జిల్లాలోని వానపల్లి గ్రామసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరు మండలం మైసూరావారిపల్లెలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
గ్రామసభల్లో ప్రధానంగా నాలుగు అంశాల గురించి చర్చించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
అంశం-1: మరుగుదొడ్లు, విద్యుత్, కుళాయి, వంటగ్యాస్ కనెక్షన్లు
అంశం-2: మురుగునీరు-ఘన వ్యర్థాల నిర్వహణ, వీధి దీపాలు, సిమెంటు రహదారులు
అంశం -3: గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, మండల కేంద్రాలకు లింక్ రోడ్లు
అంశం -4: ఇంకుడు గుంతలు, పంటకుంటల నిర్మాణం. ఉద్యానవన, పట్టు పరిశ్రమ అభివృద్ధికి సదుపాయాలు, పశువుల పెంపకం, షెడ్ల నిర్మాణానికి సహకారం.