భారత్ సమాచార్, సినిమా : జూనియర్ ఎన్టీఆర్ స్టామినా ఏంటో సినీ ప్రేమికులకు బాగా తెలుసు. ‘‘ఆర్ ఆర్ ఆర్’’ మూవీలో తన నటనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. తన మాస్ ఫర్ఫార్మెన్స్ తో కట్టిపడేసే తారక్ తో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రముఖ బాలీవుడ తారలు కూడా కలలుగంటారు. అందుకే ఈ యంగ్ టైగర్ కు జోడీ అంటే ఎప్పుడూ వెరీ స్పెషలే అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ‘దేవర’ లో జాన్వికపూర్ ను ఎంపిక చేశారు. ఈ మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ బిజీబిజీ అయిపోయారు. దీని తర్వాత హిందీలో వార్-2 షూటింగ్ లో పాల్గొననున్నారు. ఇందులో బాలీవుడ్ హాట్ బ్యూటీ శార్వరీ వాఘ్ ను తారక్ సరసన ఎంచుకున్నారు.
బాలీవుడ్ ను షేక్ చేసిన హృతిక్ రోషన్ వార్ మూవీకి పార్ట్-2గా వార్ -2 రాబోతోంది. ఈ మూవీని యష్ రాజ్ ఫిలింస్ నిర్మించింది. పార్ట్ వన్ లో హృతిక్ ను ఢీకొనే పాత్రలో టైగర్ ఫ్రాఫ్ కనిపించాడు. పార్ట్-2 లో ఈ రోల్ ను ఎన్టీఆర్ చేస్తున్నట్టు బాలీవుడ్ టాక్. తారక్ రోల్ ను దర్శకుడు శక్తివంతంగా డిజైన్ చేశాడట. ఈ భారీ యాక్షన్ మూవీలో తారక్ ఏజెంట్ గా కనిపిస్తాడట. మొదటి పార్ట్ లో పాన్ ఇండియా లెవల్ లో ‘వార్’ చేసిన సందడి అంతా ఇంతా కాదు. అంతకుమించి పార్ట్ -2ను తెరకెక్కించాలని మూవీ టీం కమిట్ అయింది. అందుకే ఉత్తరాది నుంచి హృతిక్ ను, సౌత్ నుంచి ఎన్టీఆర్ ను తీసుకుంది. దీంతో పాన్ ఇండియా బాక్సఫీస్ ను ఈ చిత్రం షేక్ చేసి కాసుల వర్షం కురుస్తుందని అంచనా వేస్తున్నారు మూవీ లవర్స్. క్రేజీ మూవీలో ఎన్టీఆర్ కు జోడిగా ‘బంటీ ఔర్ బబ్లీ-2’ తో వెండితెరకు పరిచయమై డెబ్యూ ఆఫ్ ది ఇయర్ గా ఐఫా అవార్డు సైతం దక్కించుకున్న శార్వరీ వాఘ్ ను ఖరారు చేశారు. ఈ బ్యూటీతో ఎన్టీఆర్ చేసే డాన్స్, రొమాన్స్ కోసం సీనీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. వచ్చే వేసవికి ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక భాషల్లో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.