Homemain slidesహైడ్రా పేరుతో హైదరాబాద్ లో హైడ్రామా

హైడ్రా పేరుతో హైదరాబాద్ లో హైడ్రామా

భారత్ సమాచార్, హైదరాబాద్ ;

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. హైడ్రా పేరుతో రేవంత్ ప్రభుత్వం హైడ్రామా నడుపుతోందన్నారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుని పని చేస్తోందన్నారు. న్యాయం లేకుండా.. నోటీసులు ఇవ్వకుండా హైడ్రా పేరుతో డ్రామాలు చేస్తొందని విమర్శించారు. మానసికంగా.. పొలిటికల్ గా.. ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. అక్రమాలను బీఆర్ఎస్ ఎప్పటికీ సమర్థించదన్నారు. రాజకీయ ప్రేరేపితపై చర్యలను అధికారులు ప్రేరేపించటం కరెక్ట్ కాదన్నారు. అధికారులు అత్యుత్సాహం పోవద్దని సూచించారు. అన్ని పరిశీలించాలని రాజకీయ కక్షలను విద్యాసంస్థలు, ఆసుపత్రులపై రుద్దొద్దన్నారు. సమస్యల వలయంలో రాష్ట్రం ఉంటే..రాజకీయ కుట్రలకే ప్రభుత్వం పరిమితం అవుతుందన్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకోండి.. లేకపోతే ఇబ్బంది పెడతాం అన్నట్లు సీఎం తీరు ఉందన్నారు.

విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారన్నారు. ప్రతి ఇంటిలో ఇద్దరు జ్వరంతో బాధ పడుతున్నారన్నారు. ప్రభుత్వం మాత్రం ప్రజల్ని పట్టించుకోవటం లేదన్నారు. ప్రభుత్వం ప్రత్యర్థులపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తోందన్నారు. విష జ్వరాలపై పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వస్తున్నాయన్నారు. పిట్టల్లాగా ప్రజలు రాలిపోతాఉంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదన్నారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యాతో ప్రజలు గజగజ లాడుతున్నారన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే 36 శాతం డెంగీ కేసులు పెరిగాయన్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల్లేని పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. గాంధీ ఆస్పత్రిలో సింపుల్ మెడిసిన్ కూడా అందుబాటులో లేదని ఆరోపించారు.

మరికొన్ని వార్తా విశేషాలు…

భగవద్గీత స్పూర్తి.. శ్రీకృష్ణుడే మార్గదర్శి

 

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments