July 28, 2025 5:15 pm

Email : bharathsamachar123@gmail.com

BS

QuantumValley Techpark అమరావతిలో మొట్టమొదటి క్వాంటంవ్యాలీ టెక్‌పార్క్‌‌

భారత్ సమాచార్.నెట్, అమరావతి: క్యాంటం కంప్యూటింగ్.. ఇప్పుడు ఏపీలో అందరీ నోటా ఇదే మాట.. ప్రపంచంలో దిగ్గజ కంపెనీలు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. IBM, TCS, L&T లు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకొని దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక క్వాంటం వ్యాలీ టెక్ పార్క్‌‌ని అమరావతిలో నిర్మించాలని పోటి పడుతున్నాయి. ఒకవేళ క్యాంటం వ్యాలీ మొదలైతే.. అమరావతి మరో సిలికాన్ వ్యాలీ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అమరావతి క్యాంటం వ్యాలీ హబ్‌గా మారితే ఆంధ్రప్రదేశ్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతుంది. హైదరాబాద్‌లో హైటెక్ సిటీని డెవలప్ చేసిన తరహాలోనే అమరాతిని ప్రపంచ పటంలో నిలుపుతానని సీఎం చంద్రబాబు చెబుతున్నారు.

నాటి విజన్ సైబరాబాద్.. నేటి విజన్ క్వాంటం వ్యాలీ:
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విజనరీ అని అందరూ చెబుతుంటారు. కానీ వాస్తవంగా సైబరాబాద్, హైటెక్ సిటీ నిర్మాణం తర్వాత హైదరాబాద్ దేశంలో మరో ఐటీ కేంద్రంగా మారడం చూస్తే చంద్రబాబు విజన్ ఏంటో అర్థమవుతుంది. 90వ దశకంలో సైబరాబాద్ ప్రాంతం ఎలా ఉండేదో, 30 ఏళ్లలో ఏ విధంగా మారిందో చూస్తే ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రకటించిన విజన్ 2020 లక్ష్యం నెరవేరినట్లు తెలుస్తుంది. ఇప్పుడు అదే తరహాలో‌ ఆంధ్రప్రదేశ్ ను క్వాంటం వ్యాలీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఆయన సంకల్పించారు. సీఎం చంద్రబాబు క్వాంటమ్ వ్యాలీపై ప్రకటన చేయడంతోనే దేశమంతా చర్చ మొదలైంది. అమరావతిలో నిర్మించబోయే ఈ క్వాంటమ్ వ్యాలీ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ దశ తిరుగుతుందని చర్చించుకుంటున్నారు.

టెక్నాలజీలో క్వాంటం శకం:
క్వాంటమ్ టెక్నాలజీతో పరిశోధనలు, కొత్త ఉత్పత్తుల రూపకల్పన నిమిషాలు, గంటల్లోనే పూర్తవుతుంది. ఈ సాంకేతిక విప్లవాన్ని అందిపుచ్చుకోవడానికి ఏపీకి అపారమైన అవకాశాలు ఉన్నాయి. క్వాంటమ్ వ్యాలీ కేవలం పరిశోధనా కేంద్రం కాదు. ఇది విద్యారంగం, పరిశ్రమలు, స్టార్టప్‌లు కలిసి, అంతర్జాతీయ స్థాయిలో క్వాంటమ్ ఆధారిత పరిష్కారాలను ఆవిష్కరించే వేదిక అని చెప్పవచ్చు. క్వాంటమ్ కమ్యూనికేషన్ అత్యంత సురక్షితం. హ్యాకింగ్‌కు వీల్లేకుండా సందేశాలు, ఈమెయిల్స్ పంపవచ్చు. సైబర్ నేరాల నుంచి దేశాన్ని రక్షించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

భవిష్యత్తు క్వాంటందే:
క్వాంటమ్ కంప్యూటర్లు డేటాను విశ్లేషించి, కచ్చితమైన వాతావరణ నమూనాలను తయారు చేస్తాయి. వర్షాభావ పరిస్థితులు, తుపానులు, వాతావరణ మార్పులపై మరింత ముందస్తు హెచ్చరికలు సాధ్యమవుతాయి. సాంకేతిక నిపుణులకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు అందివస్తాయి. ప్రయోగాలను మరింత కచ్చితత్వంతో నిర్వహించడానికి వీలవుతుంది. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ మార్కెట్‌ 2024లో 71.4 మిలియన్‌ డాలర్ల నుంచి 2035 నాటికి 500 మిలియన్‌ డాలర్లకు చేరనుందని అంచనా. గ్లోబల్‌ క్వాంటమ్‌ మార్కెట్‌లో ఏపీ లీడర్‌గా ఉండి దేశాన్ని అగ్రపథాన నిలుపనుంది.

మరిన్ని కథనాలు:

బిల్ గేట్స్‌తో సమావేశం అద్భుతంగా సాగిందంటూ సీఎం చంద్రబాబు ట్వీట్

Share This Post
error: Content is protected !!