July 28, 2025 6:23 pm

Email : bharathsamachar123@gmail.com

BS

ది కింగ్ ఆఫ్ మ్యూజిక్

భారత్ సమాచార్ ; భారతీయ సంగీతానికే గానం లా మారాడు ఇళయరాజా. ఆయన స్వరాలు చేరని దేశం అంటూ ఉండదంటే అతిశయోక్తి కాదు. ఈ సంగీత స్వరకర్త జీవిత విశేషాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో కూడా బయోపిక్ ల హావా నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ లిస్ట్ లోకి తాజాగా ఇళయరాజా బయోపిక్ కూడా చేరింది. మనకు తెలియని రాజా జీవిత విశేషాలు అన్ని కూడా ఇందులో పొందుపరచనున్నారు మేకర్స్.

వెండితెరపై రాజా రోల్ ను పరిపూర్ణ నటుడు ధనుష్ పోషించనున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక పోస్టర్ ను కూడా అధికారికంగా విడుదల చేశారు. చేతిలో హార్మోనియం పెట్టెను పట్టుకొని చైన్నై లోకి ఒక యువకుడు ప్రవేశిస్తున్న పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. అందులో ది కింగ్ ఆఫ్ మ్యూజిక్ అని రాసుకొచ్చారు. ధనుష్ తో ఇదివరకే ‘కెప్టెన్ మిల్లర్’చిత్రాన్ని తెరకెక్కించిన అరుణ్ మాథేశ్వరన్ దర్శకుడు. పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మరికొన్ని సినీ సంగతులు…

రేఖ సిఫార్సుతోనే శ్రీదేవి దశతిరిగింది

Share This Post
error: Content is protected !!