Homemain slidesఅట్టహాసంగా ఆస్కార్ వేడుకలు

అట్టహాసంగా ఆస్కార్ వేడుకలు

భారత్ సమాచార్, సినీ టాక్స్ : సినీ లోకం ఎంతగానో ఎదరుచూసే ఆస్కార్ వేడుకలు నేటి ఉదయం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌ డాల్బీ థియేటర్ లో యునైటెడ్ స్టేట్స్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో వేడుకల్ని నిర్వహించారు. గతంలో కంటే ఈ ఏడాది గంట ముందే వేడుక ప్రారంభమైంది. కమెడియన్ జిమ్మీ కిమ్మెల్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

విజేతల జాబితా

ఉత్తమ చిత్రం: ఒపెన్‌హైమర్

ఉత్తమ దర్శకుడు: క్రిస్టోఫర్ నోలన్ – ఒపెన్‌హైమర్ చిత్రం

ఉత్తమ నటుడు: కిలియన్ మర్ఫీ – ఒపెన్‌హైమర్ చిత్రం

ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జూనియర్ – ఒపెన్‌హైమర్ చిత్రం

ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్ – పూర్ థింగ్స్

ఉత్తమ సహాయ నటి: డేవైన్ జో రాండాల్ఫ్ – ది హోల్డోవర్స్

ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఒపెన్‌హైమర్

బెస్ట్ మ్యూజిక్(ఒరిజినల్ స్కోర్): లుడ్‌వింగ్ జోరాంసన్ – ఒపెన్‌హైమర్

ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: ఒపెన్‌హైమర్ – జెనీఫర్ లేమ్

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: 20 డేస్ ఇన్ మరియోపోల్

బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టయిల్: నడియా స్టేసీ, మార్క్ కౌలియర్, జాష్ వెస్టన్ – పూర్ థింగ్స్

బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: కార్డ్ జెఫర్‌పన్ – అమెరికన్ ఫిక్షన్

బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: జస్టిస్ ట్రైట్, అర్థర్ హరారీ – అనాటమీ ఆఫ్ ఎ ఫాల్

బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: ది బాయ్ అండ్ ది హిరాన్

బెస్ట్ కాస్టూమ్ డిజైన్: హోలి వెడ్డింగ్‌టన్ – పూర్ థింగ్స్

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: జేమ్స్ ప్రైస్, షోనా హెత్ – పూర్ థింగ్స్

బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్

ఒపెన్‌హైమర్ చిత్రానికి మొత్తం 7 అవార్డులు వరించాయి.

మరికొన్ని సినీ సంగతులు…

రేఖ సిఫార్సుతోనే శ్రీదేవి దశతిరిగింది

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments