August 8, 2025 3:15 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం.. కుంగిన రోడ్డు

భారత్ సమాచార్.నెట్, యాదాద్రిభువనగిరి: జిల్లాలో ఆర్ అండ్ బీ అధికారుల పర్యవేక్షణ లోపం,  రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో మారుమూల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భువనగిరి మండలంలోని బండసోమారం నుంచి వీరవెల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు పనులను అధికారులు తూతూమంత్రంగా పూర్తిచేసి చేతులు దులుపుకున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో రోడ్డు పనులు నామమాత్రంగా పూర్తి చేశారు. ఎలాంటి నాణ్యాతా ప్రమాణాలు పాటించకపోవడంతో రోడ్డు వేసి కనీసం నెలరోజులు కూడా కాలేదు అప్పుడే వాహనాలు రోడ్డుపై వెళ్తుంటే దిగబడుతుండడంతో అటునుంచి వెళ్లాలంటే ప్రయాణికులు జంకుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలకు సైడ్ ఇచ్చే క్రమంలో తమ వాహనాలు మట్టిలో దిగబడి ఎక్కడా బోల్తా పడుతాయోనని భయాందోళనకు గురవుతున్నారు. రోజువారి కూలీలు, ముఖ్యంగా పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థుల కోసం వచ్చే ఆర్టీసీ బస్సు ఆ రోడ్డుపై కాకుండా వేరే మార్గంలో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు స్పందించి వెంటనే నాణ్యాతా ప్రమాణాలు పాటించకుండా రోడ్డువేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని, సరైన రోడ్డు నిర్మించాలని వాహనదారులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

 

మరిన్ని కథనాలు:

పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

Share This Post