భారత్ సమాచార్, జాతీయం: మన దేశం ప్రపంచంలోనే ఆర్థిక వృద్దిలో నాలుగో స్థానంలో ఉంది. అయినా ఇప్పటికీ భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇప్పటికీ ఆకలి చావుల్లో మొదటి స్థానంలో ఉంది. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ప్రపంచంలోనే ఎక్కువ ట్యాక్స్ పేయర్స్ ఉన్న దేశం మనది. మనం కష్టపడి కడుతున్న ట్యాక్సులు ఎక్కడిపోతున్నాయో మీకు తెలుసా..? ఉచిత పథకాలతో, ఉచిత అలవెన్సులతో ఒక మధ్య తరగతి వాడు ఎంతలా నష్టపోతున్నాడో ఈ వార్త చదవండి మీకే తెలుస్తుంది. మనం కడుతున్న పన్నులు ఎటు పోతున్నాయో ఈ వార్త చదవండి మీకు ఒక అవగాహన వస్తుంది.
మన డబ్బు ఎక్కడకు పోతుంది..?
మనసుని కదిలించే కళ్లు చెదిరే నిజం. చదివిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు. మీ డబ్బు ఎక్కడకు పోతుంది?! మన భారతదేశంలో మొత్తం 4120 మంది ఎమ్మెల్యేలు, 462 ఎమ్మెల్సీలు అంటే మొత్తం 4,582 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కో ఎమ్మెల్యే జీత భత్యంతో కలిపి నెలకు 2 లక్షలు ఖర్చు చేస్తారు. మొత్తం మీద నెలకు 91 కోట్ల 64 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. దీని ప్రకారం సంవత్సరానికి సుమారు 1100 కోట్ల రూపాయలన్నమాట. భారతదేశంలో లోక్‌సభ, రాజ్యసభతో కలిపి మొత్తం 776 మంది ఎంపీలు ఉన్నారు. ఈ ఎంపీల జీత భత్యంతో కలిపి నెలకు 5 లక్షలు ఇస్తారు. అంటే మొత్తం ఎంపీల జీతం నెలకు 38 కోట్ల 80 లక్షలు. ఇక ప్రతి సంవత్సరం ఈ MPలకు జీత భత్యం కింద రూ.465 కోట్ల 60 లక్షలు ఇస్తారు. అంటే భారతదేశంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి సంవత్సరం అక్షరాల 15 వేల కోట్ల 660 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
ఇది వారి ప్రాథమిక వేతనం, జీత భత్యానికి సంబంధించిన విషయం. వారి నివాసం, జీవనం, ఆహారం, ప్రయాణ భత్యం, చికిత్స, విదేశీ విహార యాత్రలు మొదలైన వాటి ఖర్చులు వేరే ఉంటాయి. అవి కూడా కలిపితే ఎమ్మెల్యేలు, ఎంపీల కోసం సంవత్సరానికి దాదాపు 30 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి. ఇవి కేవలం వారి జీత భత్యాలు, ఇతర అలవెన్సులు మాత్రమే.
భద్రతా సిబ్బంది జీతాలు తెలుసుకుందాం
ఒక ఎమ్మెల్యేకు ఇద్దరు అంగరక్షకులు, ఒక సెక్షన్ హౌస్ గార్డు అంటే కనీసం 5 మంది పోలీసులు, అంటే మొత్తం 7 మంది పోలీసులు భద్రత కల్పిస్తారు. 7 గురు పోలీసుల జీతం సుమారుగా (నెలకు రూ. 35,000 చొప్పున) రూ. 2 లక్షా 45 వేలు. దీని ప్రకారం 4582 మంది ఎమ్మెల్యేల భద్రతకు వార్షిక వ్యయం ఏడాదికి 9 వేలకోట్ల 62 కోట్ల 22 లక్షలు. అదే విధంగా ఎంపీల భద్రత కోసం ఏటా 164 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇంకా మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రి భద్రత కోసం జెడ్ కేటగిరీ భద్రత కోసం 16000 మంది సిబ్బందిని ప్రత్యేకంగా ఉంటారు. దీని కోసం మొత్తం వార్షిక వ్యయం రూ.776 కోట్లు ఖర్చు. ఇలా ప్రతి ఏటా దాదాపు 20 వేలకోట్ల రూపాయలు పాలక నేతల భద్రతకు వెచ్చిస్తున్నారు. అంటే ఏటా కనీసం 50 వేలకోట్ల రూపాయలు రాజకీయ నాయకుల కోసం ఖర్చు చేస్తున్నారు. ఈ ఖర్చులలో గవర్నర్ ఖర్చులు, మాజీ నాయకులు, పార్టీ నాయకులు, పార్టీ అధ్యక్షుల పెన్షన్, వారి భద్రత మొదలైనవి ఉండవు. అది కూడా కలుపుకుంటే మొత్తం ఖర్చు దాదాపు 100 బిలియన్ రూపాయలు(1.1 లక్షల కోట్లు) అవుతుంది.
ఇప్పుడు ఆలోచించండి మన డబ్బు ఎటు పోతుందో
మనం ప్రతి సంవత్సరం రాజకీయ నాయకుల కోసం 100 బిలియన్ రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నాము.పేద ప్రజలకు ప్రతిఫలంగా ఏమి లభిస్తుంది. ఆకలి చావులు, కఠిక పేదరికం, అభివృద్ధి శూన్యం. పేదవాడు ఇంకా పేదవాడిగానే మిగిలి పోతున్నాడు. ఇదా మన ప్రజాస్వామ్యం, ఇదా సర్వసత్తాక, సామ్యావాద, లౌకిక రాజ్యం. 100 బిలియన్ రూపాయలను మన భారతీయుల నుండి మాత్రమే పన్నుగా వసూలు చేస్తున్నారు. ఇంకా వాటితో పాటు ఏదైనా అభివృద్ధి పనులకు నిధులు వచ్చాయంటే మంత్రి నుంచి సర్పంచ్ వరకు కమీషన్ తీసుకుని మిగిలిన డబ్బుతో నాసిరకంగా పనులు పూర్తి చేస్తారు. ఇందులో కూడా ప్రజా ప్రతినిధులకు లాభమే. ఈ నాసిరకం పనుల వల్ల ప్రజలే నష్టపోతున్నారు. ప్రజల ప్రాణాలే పోతున్నాయి.
ఇంకా వీరికి ₹29 /-కే ఫుల్ మీల్స్ లభిస్తుంది. భారతదేశంలో ఆహార పదార్థాలు అతి తక్కువ ధరకు లభించే ప్రదేశం ఒక్కటే అదే ఢిల్లీ లో ఉన్న భారత పార్లమెంట్ లో ని క్యాంటీన్‌లో
టీ = ₹ 1
sup = ₹ 5.50
పప్పు = ₹ 1.50
ఆహారం = ₹2.00
చపాతీ = ₹1.00
చికెన్ = ₹24.50
దోస = ₹4.00
బిర్యానీ=₹8.00
చేప = ₹13.00
ఈ వస్తువులన్నీ భారత పార్లమెంటు క్యాంటీన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ పార్లమెంటు సభ్యులకు,ఎంపీలకు, అందులో పనిచేసే వారికి మనమందరం కలిసి కష్టపడి సంపాదించిన డబ్బులతో వారికి మనం ఇస్తున్న దాన ధర్మం. ఆలోచించండి మనం వేసిన ఓట్లతో గెలిచి, దర్జాలు అనుభవిస్తూ మనం పెట్టిన భిక్ష తిని, మనం ఇచ్చే ఆరోగ్యం పొంది, మనం ఇచ్చే కార్లలో తిరుగుతూ వారి కుటుంబాలతో జల్సాలు చేస్తూ భోగభాగ్యాలు అనుభవిస్తూ మనల్ని మోసం చేస్తూ, మనకు ఇబ్బంది కలిగితే కంటి చూపుకు కూడా కనిపించని రాజకీయ నాయకుల జీవితం ఇది.
MP, MLA, MLCలతో పాటు ప్రజలు ఎన్నుకున్న నాయకులు పబ్లిక్ సర్వెంట్లు మాత్రమే. ఈ విషయం గుర్తు పెట్టుకుని నాయకులు పని…కాదు…కాదు సేవ చేయాలి. అంతే కానీ వీళ్లు సేవ చేయకుండా కమీషన్లు తీసుకుంటూ ప్రజల్ని చావు దెబ్బ కొడుతున్నారు. కోట్లు కోట్లు కూడబెట్టుకుంటున్నారు. అందుకే సేవ చేసే నాయకుడికి ఉచిత అలవెన్సులు మొత్తం తీసివేయాలి. కేవలం వారి జీతభత్యాలతోనే వారి ఖర్చులు వాళ్లే భరించాలి. అప్పుడే ప్రజాధనం వృథా కాదు. ఆ డబ్బు అంతా ప్రజల ప్రయోజనాలకు, దేశ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా ఉచిత పథకాలు ప్రకటించాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రజాప్రతినిధులు చేయాల్సిందే ఒక్కటే ప్రజలకు మెరుగైన ఉపాధి కల్పించడం. అప్పుడు వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఆటోమెటింగ్ గా దేశానికి ట్యాక్సులు వస్తాయి. అప్పుడు దేశ భవిష్యత్తు కూడా బాగుంటుంది. అంతే కాని ఉచితంగా ఉప్పు, పప్పు ఇస్తాం ఓట్లు వేయండి అని చెప్పకండి. గెలిపిస్తే ఉపాధి మాత్రమే కల్పిస్తాం అని మాత్రమే చెప్పండి. అప్పుడే పేద, మధ్య తరగతి కుటుంబాల బతుకులు మారతాయి.