భారత్ సమాచార్, సినీ టాక్స్: సీనియర్ తమిళ నటి విచిత్ర ఓ తెలుగు హీరోపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను హోటల్ గదిలోకి రమ్మని తనను అసభ్యంగా తాకాడని ఆరోపించింది. విచిత్ర తమిళంలో అనేక సినిమాలు చేసింది. అలాగే తెలుగు, మళయాళ భాషల్లోనూ నటించింది. పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి బుల్లితెరకు షిఫ్ట్ అయ్యింది. తమిళ బిగ్ బాస్ సీజన్ లో ఆమె తనకు జరిగిన క్యాస్టింగ్ కౌచ్ సంగతులు బయటపెట్టింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఓ తెలుగు హీరోను, తనను 3 స్టార్ హోటల్ లో ఉండమని ప్రొడ్యూసర్ చెప్పారు. ఓ రోజు పార్టీ జరుగుతోంది. అక్కడే ఆ ఫేమస్ హీరోను కలిశాను. అతడు నాపేరు కూడా అడగలేదు. కానీ డైరెక్ట్ గా గదికి వచ్చేయమన్నాడు. నేను షాకయ్యాను. అతడి మాటను పట్టించుకోకుండా వెళ్లి నా గదిలో పడుకున్నాను. ఇక ఆ తర్వాతి రోజు నుంచి షూటింగ్ లో సమస్యలు సృష్టించారు. తమిళ పరిశ్రమలో నాకు ఇలాంటి ఘటనలు ఎదురుకాలేదు.
ఆ హీరో రోజూ తాగి వచ్చి నా గది తలుపు తట్టేవాడు. ఆ గండం నుంచి ఎలా బయటపడాలోనని భయపడ్డాను. హోటల్ మేనేజర్ పరిస్థితి అర్థం చేసుకుని తనను వేరే రూమ్ కు షిఫ్ట్ చేశాడు. ఇక తెల్లారి అడవిలో షూటింగ్ లో ఆ హీరో అసభ్యంగా పలుమార్లు తాకాడు. ఈ విషయం చెబితే స్టంట్ మాస్టర్ కూడా నన్నే కొట్టాడు. ఈ విషయంపై నేను కేసు పెడితే హోటల్ మేనేజర్ వచ్చి సాక్షిగా అండగా నిలబడ్డాడు. ఆ తర్వాత ఆయనే నన్ను పెళ్లి చేసుకున్నాడు. ’’ అని విచిత్ర తనకు జరిగిన అనుభవాలను ఆడియన్స్ తో పంచుకుంది.