Homemain slidesపాలకులు మారిన పాలనలో మార్పు లేదు

పాలకులు మారిన పాలనలో మార్పు లేదు

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణలో పాలకులు మారిన పాలనలో మార్పు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతోన్న సీఎం రేవంత్‌ను ప్రజలు పట్టించుకోవడం లేదంటూ విమర్శులు గుప్పించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఉందో అర్థమవుతుందని.. అందుకు నిదర్శనం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే అని పేర్కొన్నారు. ప్రజా తీర్పు కాంగ్రెస్ పాలనకు చెంప పెట్టులాంటిదన్నారు. ప్రజలు ఇచ్చిన విజయంతో బాధ్యత మరింత పెరిగిందన్నారు. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గాను రెండింటిని బీజేపీ కైవసం చేసుకుందని.. తమ అభ్యర్థులపై నమ్మకం ఉంచి గెలిపించడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. ఇక నుంచి ‘సేవ్ తెలంగాణ- సపోర్ట్ బీజేపీ’ నినాదంతో ముందుకెళ్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అన్నారు.
అలాగే తాను రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసే అవకాశం లేదని.. త్వరలోనే తెలంగాణకు కొత్త అధ్యక్షుడు వస్తారని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments