Homebreaking updates newsరామయ్య ప్రాణప్రతిష్ఠకు వీరిద్దరే

రామయ్య ప్రాణప్రతిష్ఠకు వీరిద్దరే

భారత్ సమచార్, సినీ టాక్స్ : మెగాస్టార్ చిరంజీవి, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కేంద్ర పెద్దల నుంచి ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు. వచ్చే నెల 22న అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠకు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో బీజేపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని సంకల్పించింది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఈక్రమంలో టాలీవుడ్ నుంచి చిరు, ప్రభాస్ లకు ఆహ్వానాలు అందాయి.

వచ్చే నెల 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభం కాబోతోంది. ఆరోజు శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం దేశవ్యాప్తంగా దాదాపు 2వేల మంది ప్రముఖులకు ఆలయ ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది.

ఈక్రమంలో టాలీవుడ్ నుంచి చిరంజీవి, ప్రభాస్ ఆహ్వానించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవిది చెక్కుచెదరని స్థానం. గత నలభై ఏండ్లుగా ఆయన సినీ పరిశ్రమను ఏలుతున్నారనే చెప్పాలి. ఇక ప్రభాస్ ఫ్యామిలీ మొదటి నుంచి బీజేపీలోనే ఉంది. అలాగే ప్రభాస్ ‘ఆదిపురుష్’లో రాముడి పాత్రలో నటించాడు. అందుకే వీరికి ఆహ్వానాలు అందాయని తెలుస్తోంది.

టాలీవుడ్ లో ఎన్టీఆర్, నితిన్ , నిఖిల్ కూడా బీజేపీ నేతలతో సన్నిహితంగానే ఉంటున్నారు. ఇక పవన్ పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. అయితే వీరికి ఆహ్వానాలు అందలేదు. ఇంకా టైం ఉంది.. కాబట్టి వీరిలో కొందరికి ఆహ్వానాలు అందే అవకాశం ఉండొచ్చు. ఇక తమిళం నుంచి రజనీకాంత్, ధనుష్ లకు, కన్నడ నుంచి యశ్, రిషబ్ శెట్టిలకు, మలయాళం నుంచి మోహన్ లాల్ కు ఆహ్వానాలు అందాయి.

బాలీవుడ్ నుంచి బిగ్ బీ అమితాబ్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, టైగర్ ష్రాఫ్, అజయ్ దేవగన్ లకు ఆహ్వానాలు అందాయి. వీరితో పాటు మాధురీ దీక్షిత్, అనుపమ్ ఖేర్, రాజ్ కుమార్ హిరానీ, సంజయ్ లీలా భన్సాలీ, రోహిత్ శెట్టిలకు ఆహ్వానాలు అందించారు.

మరికొన్ని కథనాలు…

వెండితెర హాస్య బ్రహ్మను చేస్తే కనీసం…

RELATED ARTICLES

Most Popular

Recent Comments