భారత్ సమాచార్, చరిత్రలో ఈ రోజు: జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్రర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్‌సర్ పట్టణంలో ఒక తోట. ఏప్రిల్ 13, 1919 న బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000 కి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు.
1741లో డచ్ ప్రజలు రొట్టె నాణ్యతను నిరసించారు.
1741లో వూల్‌విచ్‌లో రాయల్ మిలిటరీ అకాడమీ ఏర్పడింది.
1796లో మొదటి ఏనుగు భారత్ నుంచి అమెరికాకు చేరుకుంది.
1934లో, US కాంగ్రెస్ జాన్సన్ డెట్ డిఫాల్ట్ చట్టాన్ని ఆమోదించింది.
1905 : ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, రేడియో అన్నయ్యగా సుపరిచితుడు న్యాయపతి రాఘవరావు జననం (మ.1984).
1914 : ఆధ్యాత్మికవేత్త, బహుభాషా కోవిదుడు, వేదాంతభేరి వ్యవస్థాపకుడు విద్యా ప్రకాశానందగిరి స్వామి జననం (మ.1998) .
1919 :పంజాబ్ లోని జలియన్ వాలా బాగ్ నందు సమావేశమైన భారతీయ ఉద్యమకారులపై జనరల్ కాల్పులు జరిపాడు.
2007 : సినిమా నటుడు ధూళిపాళ సీతారామశాస్త్రి మరణం (జ.1921).
2007 : రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి మరణం (జ.1933).
1999 : నాదస్వర విద్వాంసులు షేక్ చిన మౌలానా మరణం