Homemain slidesజిత్తుల మారి పొత్తుల కథ ఇది...

జిత్తుల మారి పొత్తుల కథ ఇది…

భారత్ సమాచార్, రాజకీయం : మీరు చిన్నప్పుడు జిత్తుల మారి నక్కల కథలు చదివుంటారు లేదా విని ఉంటారు. కానీ ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ టైం కదా జిత్తుల మారి పొత్తుల కథ చెపుతా వినేయండీ, కాదు చదివేయండీ.

కథలోకి వెళ్లే ముందు, ఆంధ్రప్రదేశ్ 2019 ఎన్నికల ఫలితాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. ఏపీలో ఉన్న మొత్తం అసెంబ్లీ సీట్ల సంఖ్య-175

(2019 ఎన్నికల ఫలితాల ప్రకారం)

ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ గెలుపొందిన సీట్ల సంఖ్య-151
ఓట్ల శాతంలో చూసుకుంటే-49.95%

ప్రతిపక్షం టీడీపీ సాధించిన సీట్లు-23
ఓట్ల శాతం-39.17%

జనసేన కూడా ఒక స్థానం గెలుపొందింది.
ఓట్ల శాతం-5.53%

కాంగ్రెస్ పార్టీకి-1.17% ఓట్లు పడ్డాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 0.84% శాతం ఓట్లు మాత్రమే సంపాదించింది. 173 స్థానాల్లో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా చాలా మటుకు రాలేదు. ఇది 2019 ఎన్నికల్లో ఆ పార్టీ పరిస్థితి.

ప్రస్తుతం 2024 ఎన్నికల కోసం అధికార పక్షం ‘సిద్ధం’ అంటోంది. ప్రధాన ప్రతిపక్షం ‘యువగళం’తో పాదయాత్ర చేసి ‘రా, కదలిరా’ అంటూ ‘శంఖారావం’ పూరిస్తోంది. వారి మిత్ర పక్షం ‘సమరానికి సేనాని సై’
అంటూ పోటీకి సన్నద్ధం అవుతోంది. ఈ మధ్య షర్మిలక్క కూడా కాంగ్రెస్ తరపున ప్రత్యేక హోదా పాట అందుకోని ప్రజల్లోకి వెళుతోంది.

ప్రస్తుతం కాంగ్రెస్ మినహా మిగతా పార్టీలన్నీ కూడా ఈ ఎన్నికల్లో బీజేపీతో అధికార, అనధికార పొత్తుల కోసం తెగ ఉబలాటపడిపోతున్నాయి. గత ఎన్నికల్లో ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా లేని బీజేపీ పార్టీ తో పొత్తు కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు వరుస పెట్టి దిల్లీ ప్రదక్షిణలు చేస్తున్నాయి.

చంద్రబాబు అమిత్ షా ను కలిస్తే, జగన్ వెళ్లి మోదీని కలుస్తాడు. వీరు ఏపీకి తిరిగి వచ్చాక మరో ప్రత్యేక ప్లైట్ లో జన సేనాని వెళ్తాడు. కానీ కాషాయపార్టీ మాత్రం ఏటు తేల్చకుండా వ్యూహాత్మక మౌనం పాటింస్తుందని ఇన్ సైడర్ టాక్. కేంద్ర ప్రభుత్వం పొత్తుల గురించి ముందడుగు వేయకుండా జగన్నాటకం ఆడుతోందని మరో టాక్.

తాజాగా బాబు, పవన్ బీజేపీ కోసం కొన్నీ సీట్లు అలాగే పెట్టి మరి తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. 175 గానూ 118 స్థానాల్లో టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పటికీ భాజపా తమ వైఖరి ఏంటో ఇంకా వెల్లడించలేదు. అంతిమంగా ఈ పొత్తుల కథ ఏ కంచికి చేరుతుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండీ.

మరికొన్ని రాజకీయ సంగతులు…

ఉచితాలేవీ కూడా ఉచితం కానే కాదు…

RELATED ARTICLES

Most Popular

Recent Comments