August 8, 2025 3:51 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

BJP MP Raghunandan: బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్

భారత్ సమాచార్.నెట్: బీజేపీ నేత, మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావుకు ఒక బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం రేపింది. ఈరోజు సాయంత్రంలోగా చంపేస్తామంటూ మావోయిస్టుల పేరుతో బెదిరింపు కాల్ వచ్చింది.  తాను మధ్యప్రదేశ్‌కు చెందిన మావోయిస్టునంటూ ఆ ఆగంతకుడు ఫోన్‌లో రఘునందన్‌ను బెదిరించాడు. ఈ బెదిరింపు కాల్‌పై రఘునందన్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఓ ప్రైవేటు పాఠశాల కార్యక్రమానికి ఎంపీ హాజరైన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఫోన్‌కాల్‌ను రఘునందన్‌ పీఏ లిఫ్ట్‌ చేశారు.  వెంటనే రఘునంధన్ రావు బెదిరింపు కాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు అలెర్ట్ అయిన డీజీపీ, మెదక్‌ జిల్లా ఎస్పీ ఆయన ఇంటివద్ద భద్రతను మరింతగా పెంచారు. రఘునంధన్ రావుకు బెదిరింపు కాల్ రావడం ఇప్పుడు రాష్ట్రరాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇకపోతే రఘునందన్ రావు ఫిర్యాదుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక కాల్ వచ్చిన నంబర్, మాట్లాడిన వ్యక్తి వివరాలపై నిఘా వర్గాలు, సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తు్న్నారు. రఘునందన్ రావుకు పటిష్టమైన భద్రత కల్పించడంతో పాటు, ఈ బెదిరింపు కాల్ వెనుక ఉన్న నిజాలను బయటపెట్టాడానికి పోలీసులు కృషి చేస్తున్నారు.
Share This Post