July 28, 2025 11:49 am

Email : bharathsamachar123@gmail.com

BS

ఏపీకి మూడు తుపాన్ల హెచ్చరిక

భారత్ సమాచార్, వైజాగ్ ;

బుడమేరు వాగు విజయవాడను ముంచెత్తి మిగిల్చిన విషాదాన్ని ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఈ ఘటనలో దాదాపుగా 65 మంది మరణించిన విషయం తెలిసిందే. లక్షల మంది ప్రజలు నిర్వాసితులు అయ్యారు. ఇప్పుడిప్పుడే విజయవాడలో మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇంతలోపే మరో మూడు తుపాన్ల హెచ్చరికలను వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ కుజారీ చేసింది. అక్టోబర్ 10 తేదీ తర్వాత ఏపీ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అరేబియాలో సముద్రంలో 1, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉంటుంది అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు.ఎక్కువగా కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఈ ప్రభావంతో రాగల 3 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని అప్రమత్తం చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టనుంది. రానున్న పరిస్థితుల ఆధారంగా మత్యకారులకు హెచ్చరికలు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

మరికొన్ని వార్తా విశేషాలు...

వేశ్య గర్భంలో పుట్టిన భారతీయ నది గురించి తెలుసా..?

 

Share This Post
error: Content is protected !!