August 4, 2025 7:07 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

Thug Life: కమల్ సినిమాకు రక్షణ కల్పిస్తాం.. సుప్రీంకోర్టుకు తెలిపిన కర్ణాటక ప్రభుత్వం

భారత్ సమాచార్.నెట్: ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన ‘థగ్ లైఫ్ (Thug Life)’ సినిమా విడుదల వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. కన్నడ భాష (Kannada Language)పై కమల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన నటించిన సినిమాను కర్ణాటకలో బ్యాన్ చేశారు. ఈ సినిమాను బ్యాన్ చేయడంపై మేకర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తాజాగా ఈ నోటీసులపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.
కమల్ హాసన్ నటించిన చిత్రానికి రక్షణ కల్పిస్తామని కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో ఈ సినిమా విడుదలకు మార్గం సుగమైంది. విచారణ సందర్భంగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ మన్మోహన్‌ కూడిన బెంచ్‌ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలా తరచూ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ పలు సంఘాలు ఆందోళనలు చేపడితే ఆర్ట్ క్రియేషన్ నిలిచిపోతోందని పేర్కొంది. ఇది ఏమాత్రం సరికాదని న్యాయస్థానం అభిప్రాయపడింది.
సినిమాను విడుదల చేయకుండా బెదిరింపులకు పాల్పడుతున్నవారిని అదుపులోకి తీసుకోవాలని.. అలాగే వారికి వ్యతిరేకంగా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని కోర్టు సూచించింది. కాగా కన్నడ భాష తిమళం నుంచే ఉద్భవించిందంటూ కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కమల్ చేసిన వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను తాత్కాలికంగా నిషేధించారు.
Share This Post