Homemain slidesకాలం నీతో నడువదు..నిన్నడిగి ముందుకు సాగదు..

కాలం నీతో నడువదు..నిన్నడిగి ముందుకు సాగదు..

భారత్ సమాాచార్, అక్షర ప్రపంచం : ఎన్నో కొత్త అనుభూతులను, ఎన్నో విజయాలను..మన జీవితంలోకి తీసుకొచ్చేందుకు 2024 వచ్చేసింది. గతేడాది బాధలు, ఆనందాలు, జయాలు, అపజయాలు.. అన్నీ ఇక గతమే. అవి ఇక జ్ఞాపకాలు మాత్రమే. గత సంవత్సరం చేదు అనుభవాలను తల్చుకుంటూ ఉంటే లాభం ఉండదు. జీవన ప్రయాణం సాగాల్సిందే. నిన్నటి వైఫల్యాలు నిన్నటివే. నేటి నుంచి కొత్త విజయాల కోసం మనల్ని మనం సిద్ధపరుచుకోవాల్సిందే. ప్రతీ క్షణాన్ని పొదుపుగా వాడుకోవాలి.

విద్యార్థులు తమ వార్షిక పరీక్షలు, ఎంట్రెన్స్ పరీక్షలు, నిరుద్యోగులకు కాంపిటీటివ్ పరీక్షలు.. ఇలా అందరికీ పరీక్షలే. ఆ పరీక్షల్లో సత్తా చాటాలంటే సమయపాలన, విషయ స్పష్టత, సానుకూల దృక్పథం, నిత్యసాధన, కష్టపడే తత్వం.. ఇవన్నీ అవసరం. వీటిలో ఏ ఒక్కటి చేయకున్నా నీ విజయం నీకు లభించదు. అందరిలో ఒక్కడిగా మిగిలిపోతావు. శ్రమే ఆయుధంగా పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తే అందరిలో ఒకే ఒక్కడిగా గుర్తించబడుతావు.

ఇక ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు..ఇలా ప్రతీ ఒక్కరూ తమ తమ రంగాల్లో విజయాలు సాధించాలని, డబ్బు సంపాదించాలని, తమ కుటుంబాన్ని ఆనందంగా చూసుకోవాలని నిత్యం కష్టపడుతుంటారు. గతేడాది తప్పిదాలు ఏంటో సరిచూసుకుని.. వాటిని పునరావృతం కాకుండా చూసుకుని.. ఈ ఏడాదిలో తమ లక్ష్యం వైపు అడుగులు వేయాలి.

జీవితం అంటే లక్ష్య సాధనలే కాదు కుటుంబ సంతోషం, ఆత్మీయుల ఆనందం, బంధుత్వాలు, చుట్టాలు, చుట్టరికాలు, స్నేహితుల తోడు ..ఇలా వీటిని కూడా నిలుపుకోవాలి. వాటికి కూడా సమయం కేటాయించాలి. అప్పుడే జీవితం రంగులమయం అవుతుంది. జీవితమన్నాక కష్టం, సుఖం, ఓటమి, గెలుపు..ఇలా రెండూ ఉండాలి. రెండింటి ఫలితాలను మనం అనుభవించాలి. అప్పుడే మనమెంతా సమర్థులమో తెలుస్తుంది. అన్నీ గెలుచుకుంటూ వెళ్తే థ్రిల్ ఏముంటుంది..అప్పుడప్పుడు ఓటములు రావాలి. వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. అవి మరో పెద్ద విజయానికి దారితీయాలి.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

అటుకులు నచ్చని నేటి శ్రీకృష్ణుడి కథ…

RELATED ARTICLES

Most Popular

Recent Comments