July 28, 2025 5:46 pm

Email : bharathsamachar123@gmail.com

BS

వేసవిలో శ్రీవారి సామాన్య భక్తులకు ప్రాధాన్యత

భారత్ సమాచార్.నెట్, తిరుమల: కలియుగ ప్రత్యేక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి (Sri Venkateshwara Swamy) ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉగాది (Ugadi) పండుగతో పాటు మూడు రోజులు వరుసగా సెలవులు రావడంతో భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో టీటీడీ (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో బ్రేక దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. అంతేకాకుండా సిఫార్సు లేఖల విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
వేసవిలో తిరుమలలో అధిక రద్దీ ఉండడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ముందస్తు చర్యలు చేపట్టాలని టీటీడీ భావిస్తోంది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ 30వ తేదీ వరకు సిఫారసు లేఖలు తగ్గించి సామాన్యులకు ప్రాధాన్యం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బ్రేక్ దర్శనాల కారణంగా సామాన్య భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో ఏప్రిల్‌ మొదటి వారం నుండి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, స్థానిక అధికారులు, చిన్న చిన్న ప్రభుత్వ సంస్థలకు ఇచ్చే సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్‌ దర్శనాన్ని రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది.
కేవలం స్వయంగా వచ్చే అధికారులకు మాత్రమే అవకాశం కల్పిస్తారని సమాచారం. ఈ అంశంపైన టీటీడీ ఇప్పటికే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఒకేసారి రద్దు చేయకుండా ముందస్తు సమాచారంతో నిర్ణయం అమలు చేయాలని భావిస్తుంది. కాగా వీఐపీ బ్రేక్ దర్శనం కారణంగా.. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో ఉచిత సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ వెల్లడించింది.
Share This Post
error: Content is protected !!