August 2, 2025 3:50 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

rasi phalalu నేటి రాశిఫలాలు

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: రాశిఫలాలు (దిన ఫలాలు)
ఆయనము: ఉత్తరాయనం
సంవత్సరం: శ్రీవిశ్వవసునామ
మాసం: శ్రావణమాసం శుక్రవారం
తిథి: శు. అష్టమి
నక్షత్రం: స్వాతి

మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారం (ఆగస్ట్ 1వ తేదీ) రాశిఫలాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

మేషం: వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. వ్యాపారాల్లో కొద్ది మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని సరికొత్త నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. కుటుంబ జీవితంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యక్తిగత సమస్యల పరిష్కారంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.

వృషభం: వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు ప్రత్యేక విలువ ఉంటుంది. అధికారులకు మీ సలహాలు, సూచనలు బాగా ఉపయోగపడతాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి.

మిథునం: ఉద్యోగంలో ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు సమకూరుతాయి. నిర్వహించే పనులన్నీ సవ్యంగా జరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో గుడ్ న్యూస్ వింటారు. ప్రయాణాల్లో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

కర్కాటకం:
ఉద్యోగంలో శుభవార్త వింటారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి చేకూరుతుంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా సాగిపోతాయి. అనుకోని ఖర్చులు మీద పడే అవకాశం ఉంటుంది. నిర్వర్తించాల్సిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభఫలితాలు వస్తాయి.

సింహం: ఉద్యోగ జీవితం సాఫీగా, సంతృప్తికరంగా సాగుతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ ఉంటుంది. కొత్త అవకాశాలు అందివస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థికంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం ఉత్తమం. స్నేహితుల వల్ల కొంతవరకు నష్టపోయే సూచనలున్నాయి.

కన్య: ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంటుంది. సహచరుల నుంచి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి ఉద్యోగం మారే ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కొత్త నిర్ణయాలకు, కొత్త ప్రయత్నాల్లో అనుకూలత లభిస్తుంది.

తుల: ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులు బాగా సంతృప్తి చెందుతారు. పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు మార్గం సుగమం అవుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు బాగా పెరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.

వృశ్చికం: ఉద్యోగంలో అధికారులకు, సహచరులకు ఆశించిన సహాయ సహకారాలు పూర్తిస్థాయిలో అందిస్తారు. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడడం సరికాదు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా ముందుకు సాగుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

ధనుస్సు: వృత్తి, ఉద్యోగాల్లో ఈ రాశి వారు తమ శక్తి సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు. వ్యాపారాలు బాగా లాభసాటిగా పురోగమిస్తాయి. చేపట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ఎంతోకొంత ఒత్తిడి ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. చేయాల్సిన ప్రయాణాలను వాయిదా వేయడంమంచిది. నిరుద్యోగులు శుభవార్త వింటారు.

మకరం: ఉద్యోగంలో మీ పనితీరుకు, శ్రద్ధాసక్తులకు అధికారుల నుంచి ఉత్తమ ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకూలత లభిస్తుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్ని పూర్తి చేయడంలో కుటుంబసభ్యుల సహాయం లభిస్తుంది. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా సాగిపోతుంది. కుటుంబంతో కలిసి విహార యాత్రకు ప్రణాళికలు చేస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది.

కుంభం: ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. ఉద్యోగం కోసం చేసే ప్రయ త్నాల్లో శుభవార్త వింటారు. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాలపై శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సవ్యంగా పూర్తవుతాయి.

మీనం: ఉద్యోగంలో బరువు బాధ్యతలు కొంతవరకు పెరుగుతాయి. అధికారులు మీ సమర్థతను గుర్తించి ప్రోత్సహిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభం ఉంటుంది. ఆస్తి వ్యవహారాల్లో లాభాలు పొందడానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పరవాలేదు. ప్రయాణాలు సాఫీగా జరుగుతాయి.

Share This Post