భారత్ సమాచార్, చరిత్రలో ఈ రోజు ;
చరిత్రలో నేటి ప్రముఖ దినోత్సవాలు…
కామన్వెల్త్ దినోత్సవం.
జాతీయ సోదరుల దినోత్సవo.
నేషనల్ ఏవియేషన్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ డే.
నేషనల్ స్కావెంజర్ హంట్ డే.
చరిత్రలో నేటి ప్రముఖ సంఘటనలు…
1844 : మొట్టమొదటి టెలిగ్రాఫు సందేశాన్ని సామ్యూల్ F. B. మోర్స్ అను శాస్త్రవేత్త వాషింగ్టన్ డీ.సీ. నుండి బాల్టిమోర్ కు ప్రసారము చేశాడు.
1875: సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ స్కూల్ ను స్థాపించాడు. ఇదే 1920లో అలీఘర్ ముస్లిం యూనివర్శిటీగా అవతరించింది.
ప్రముఖుల జననాలు…
1686: ‘డేనియల్ గాబ్రియల్ ఫారెన్‌హీట్’ అతి కచ్చితంగా వేడిని కొలిచే ‘థర్మామీటర్’ (1714లో మెర్క్యురీ (పాదరసం) థర్మామీటర్) ని కనుగొన్నాడు. 1709 లో ఆల్కహాల్ థర్మామీటర్ ని కనుగొన్నాడు. (మ.1736).
1819: బ్రిటన్ రాణి విక్టోరియా, బ్రిటీషు మహారాణి. (మ.1901).
1911: ఎస్.వి.ఎల్.నరసింహారావు, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2006)
1933: పి.జె.శర్మ, డబ్బింగ్ కళాకారుడు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (మ.2014)
1942: విజయచందర్ , తెలుగు చలన చిత్ర నటుడు, నిర్మాత.
1966: జీవిత, చలన చిత్ర నటి, దర్శకురాలు, రాజకీయ నాయకురాలు.
1990: రాగిణి ద్వివేది, దక్షిణ భారత సినీ నటి.
ప్రముఖుల మరణాలు…
1543: నికొలస్ కోపర్నికస్, ఖగోళ పరిశోధకుడు, పోలాండ్లో మరణించాడు.
1997: నల్లమల గిరిప్రసాద్, కమ్యూనిస్టు నేత. (జ.1931)
2013: రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు, రచయిత, సాహితీ వేత్త. (జ.1928)