భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;
నేటి ప్రత్యేకం
వరల్డ్ టౌన్ ప్లానింగ్ డే.
అంతర్జాతీయ రేడియాలజి దినోత్సవం.
ప్రముఖుల జననాలు
1656: ఎడ్మండ్ హేలీ, తోకచుక్కను కనుగొన్న హేలీ ఇంగ్లండులో హేగర్‌స్టన్‌లో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు.
1884: హెర్మన్ రోషాక్, స్విడ్జర్లాండ్‌కు చెందిన మానసిక శాస్త్రవేత్త
1893: ద్వారం వెంకటస్వామి నాయుడు, వాయులీన విద్వాంసుడు
1896: పప్పూరు రామాచార్యులు, తెలుగు కవి
1908: రాజారావు, ఆంగ్ల నవలా, కథా రచయిత. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత
1917: చిటిమెళ్ళ బృందావనమ్మ, విద్యావేత్త, సంఘ సేవకురాలు, చిత్రకారిణి
1918: బరాటం నీలకంఠస్వామి, ఆధ్యాత్మిక వేత్త
1927: లాల్ కృష్ణ అద్వానీ, భారతీయ జనతా పార్టీనాయకుడు.
1936: ఎస్.గంగప్ప, తెలుగు రచయిత.
1969: ఎనుముల రేవంత్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు, తరువాత కాంగ్రెస్ లో చేరాడు.
1986 : ఆరోన్ స్వార్ట్జ్, ఒక అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్, రచయిత, రాజకీయ నిర్వాహకుడు, అంతర్జాల కార్యకర్త.
ప్రముఖుల మరణాలు
1971: పూతలపట్టు శ్రీరాములురెడ్డి, తెలుగు కవి, అనువాదకులు
1977: బి.ఎన్.రెడ్డి, తెలుగు సినిమా దర్శకుడు
2012: జస్టిస్ సర్దార్ అలీ ఖాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన న్యాయమూర్తి.
2013: ఎ.వి.ఎస్., తెలుగు సినిమా హాస్యనటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, రాజకీయనాయకుడు
చరిత్రలో ప్రముఖ సంఘటనలు
1947: జూనాగఢ్ సంస్థానం భారత్‌లో విలీనమయ్యింది.
1948: మహత్మా గాంధీని హత్య చేసినట్లుగా నాథూరాం గాడ్సేఅంగీకరించాడు, కాని కుట్ర చేసినట్లుగా ఒప్పుకోలేదు.
2016: రు.500, రు.1000 నోట్లను భారత ప్రభుత్వం రద్దు చేసింది.