Homemain slidesచరిత్రలో ఈ రోజు అక్టోబర్ 5వ తేదీ

చరిత్రలో ఈ రోజు అక్టోబర్ 5వ తేదీ

భారత్ సమాచార్, నేటి ప్రత్యేకత ;

నేటి ప్రత్యేకత

అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవము

ప్రముఖుల జననాలు

1882: రాబర్ట్ గొడ్డార్డ్, అమెరికా దేశపు రాకెట్ల పితామహుడు.

1885: రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు, సూర్యరాయాంధ్రనిఘంటువును ప్రచురించాడు. పూర్తిగా ఉత్తరవాదిగా వ్యవహరించాడు. మొట్టమొదటి తెలుగు టైపురైటరు కూడా ఇతడి హయాంలోనే మొదలయింది.

1914: పేరేప మృత్యుంజయుడు, భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, స్వాతంత్య్రసమర యోధుడు.

1929: జి.వెంకటస్వామి, భారత పార్లమెంటు సభ్యుడు, భారత జాతీయ కాంగ్రెసు పార్టీకి చెందిన సభ్యుడు.

1929: గుత్తా రామినీడు, తెలుగు సినీ దర్శకుడు, సారథి స్టూడియో వ్యవస్థాపకుడు.

1930: మధురాంతకం రాజారాం, రచయిత.

1952: కంచ ఐలయ్య, భారతీయ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సాగుతున్న సైద్ధాంతిక ఉద్యమంలో ముఖ్య పాత్ర వహిస్తున్నాడు

1954: ఎం.వి.రఘు, ఛాయాగ్రాహకుడు, కళ్లు సినిమా దర్శకుడు.

1965: కల్పనా రంజని, మలయాళ సినిమా నటి

ప్రముఖుల మరణాలు

2001: కల్లూరి తులశమ్మ, సంఘసేవకురాలు, ఖాదీ ఉద్యమ నాయకురాలు.

చరిత్రలో ప్రముఖ చారిత్రక సంఘటనలు

1864: కలకత్తాలో వచ్చిన పెను తుపానులో నగరం నాశనమైంది. 60,000 మందికి పైగా మరణించారు.

1964: రెండవ అలీన దేశాల సదస్సు కైరోలో ప్రారంభమైనది.

2006: కేంద్ర ప్రభుత్వము తన ఉద్యోగుల జీత భత్యాలను సవరించటానికి జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ ఛైర్‌మన్ గా ఆరవ వేతన సంఘాన్ని నియమించింది. 18 నెలలలో నివేదిక సమర్పించాలని చెప్పింది. ప్రొఫెసర్ రవీంద్ర ధోలకియా, జె.ఎస్. మాథుర్ లు సభ్యులుగా, శ్రీమతి సుష్మా నాథ్, మెంబర్-సెక్రటరీగా ఉన్నారు.

మరికొన్ని ప్రత్యేక కథనాలు

చరిత్రలో ఈ రోజు అక్టోబర్ 4వ తేదీ

 

 

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments