Homemain slidesసామాజిక సాధికారత దినోత్సవం

సామాజిక సాధికారత దినోత్సవం

భారత్ సమాచార్, జాతీయం ; డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ నాయకత్వంలో భారతదేశంలో దళితుల మొదటి సామూహిక నిరసన 1927 మార్చి 20 న చేపట్టారు. బాబాసాహెబ్ చేపట్టిన ఈ ఉద్యమం, భారతదేశ అంటరాని వారికి సామాజిక వైకల్యానికి వ్యతిరేకంగా పోరాడే విశ్వాసాన్ని ఇచ్చింది.

1927 మర్చి 20న, మూడువేల మంది అంటరాని వాళ్ళను వెంట బెట్టుకొని రాయగఢ్ జిల్లాలో వున్న మహద్ అనే ఊరిలోగల చావ్ దార్ చెరువుకు అంబేడ్కర్ వెళ్ళారు. ఆ రోజుల్లో దళితులను అంటరానివాళ్లుగా చూసేవారు. వారి ఉనికి సైతం పరిసరాలను మైలపరుస్తుందని మూతికి ముంత, మొలకు చీపురు కట్టించి అవమానపరచిన సమాజం అప్పటిది. కనీసం ప్రాణం నిలిపే మంచినీటిపై కూడా హక్కులివ్వని వివక్షాపూరిత సమాజం ఆనాటిది. అలాంటి రోజుల్లో బాబాసాహెబ్ ఈ ఉద్యమానికి రూపకల్పన చేశారు. ఊరేగింపుగా చావదార్ చెరువుకు వెళ్ళి, అందులో దిగి, ఆ నీటిని తాగడం ద్వారా, ఆ నీటిపై తమకు హక్కుందని తెలియజేసారు. ఆ వెంటనే అయన వెంట ఉన్న అనేక మంది చెరువులో దిగి నీటిని తాగి, వాళ్ళు తెచ్చుకున్న పాత్రలో నీటిని నింపుకొని ఇళ్లకు తీసుకెళ్లారు. దీంతో అక్కడ పెద్ద అలజడి చెలరేగింది. ఆధిపత్య కులస్తులు దాడులకు దిగారు. తరువాత గో మూత్రం, ఆవుపాలు, పెరుగు, ఆవునెయ్యి, ఆవుపేడ రంగరించి, ఆ మిశ్రమాన్ని 108 కుండలలో సేకరించి చెరువులో వేదమంత్రాల నడుమ గుమ్మరించి అది శుద్ధి అయినట్టు ప్రకటించారు.

దళితుల మొదటి సామూహిక నిరసనలకు గుర్తుగా ఆ రోజుని మహద్ సత్యాగ్రహ దినోత్సవంగా ప్రకటించారు. మహద్ సత్యాగ్రహానికి గుర్తుగా మార్చి 20ని భారతదేశ సామాజిక సాధికారత దినోత్సవం మనం పాటిస్తున్నాం.

ఏ చెరువులో అయితే అంబేడ్కర్ ని, తన జాతి వారిని నీరు తాగనివ్వలేదో, అదే చెరువు నడి బొడ్డుపై ఆయన విగ్రహాన్ని తర్వాత ప్రతిష్టింపజేశారు.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

కులం కంపు.. స్వార్థ రాజకీయాలు.. ఇదే మన దేశ అభివృద్ధి

RELATED ARTICLES

Most Popular

Recent Comments