August 3, 2025 1:47 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

Today’s horoscopes నేటి రాశిఫలాలు

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: మేషం రాశి నుంచి మీనం రాశి వరకు నేటి రాశిఫలాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
మేషం: మిత్రులతో ఉల్లాసంగా గడుపడంతోపాటు ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు. కీలక నిర్ణయాలకు తగిన సమయం. తీర్థయాత్రలు చేస్తారు. కొన్ని వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు.

వృషభం: రెట్టించిన ఉత్సాహంగా ముఖ్య వ్యవహారాలు పూర్తి చేసి పట్టుదల వీడకుండా ముందడుగు వేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు పూర్తిస్థాయిలో అందుతాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. స్థిరాస్తుల ఒప్పందాలు చేసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలలో మరింత లాభాలు అందుతాయి.

మిథునం: ఆత్మీయుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. బంధువులతో ఒక ముఖ్యవిషయంపై సలహాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కొంత మెరుగుపడుతుంది.

కర్కాటకం: ఆదాయం అంచనాలకు తగినంతగా ఉంటుంది. బంధువుల ప్రోద్బలంతో పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులకు నూతనోత్సాహం. పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆస్తి వ్యవహారాలలో సమస్యలు తొలగిపోతాయి. గతం గుర్తుకు వస్తుంది. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి.

సింహం: ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. పనుల్లో ముందడుగు వేస్తారు. తీర్థయాత్రలు పూర్తి చేస్తారు. సేవాభావంతో ముందుకు సాగుతారు. దూరపు బంధువులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. కొత్త వ్యాపారాలు ఆరంభిస్తారు. ఉద్యోగాలలో ఉన్నతస్థాయికి చేరతారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వాహనయోగం. ముఖ్యమైన చర్చలు సఫలీకృతమవుతాయి.

కన్య: కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో దాల్చుతాయి. విద్యార్థులు, ఉద్యోగార్ధులకు ఊహించని అవకాశాలు వస్తాయి. కొత్త పరిచయాలు పెరుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు. వాహన, గృహయోగాలు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

తుల: కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు కొంత వరకు తీరతాయి. కష్టపడ్డా అనుకున్న ఫలితాలు దక్కవు.
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వీడండి. ఒక సమాచారం విద్యార్థులకు నిరాశ కలిగించవచ్చు. దూరప్రయాణాలు చేస్తారు. మనస్సు కొంత ఆందోళనగా ఉంటుంది. వ్యాపారాలలో నూతనపెట్టుబడులు ఆలస్యమవుతాయి.

వృశ్చికం: ఈ రాశి వారు చేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొంటారు. విద్యార్థులు నైపుణ్యానికి గుర్తింపు పొందుతారు. బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ప్రత్యర్థుల నుంచికూడా అనుకూల సంకేతాలు వస్తాయి.

ధనుస్సు: కొత్తగా చేపట్టిన కార్యక్రమాలను కొంచెం ఆలస్యంగా పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆహ్వానాలు అందుతాయి. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఆరోగ్యం కాస్త మందగిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు నెమ్మదిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు మరింతగా పెరుగుతాయి.

మకరం: సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నూతన ఉద్యోగాల్లో చేరతారు. ఆస్తి వివాదాలు తీరతాయి. గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి.

కుంభం: నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. అదనపు ఆదాయం చేకూరుతుంది. స్నేహితులతో విభేదాలు తొలగిపోతాయి. విద్యార్థులు ఆశించిన అవకాశాలు అందుకుంటారు. ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు. దేవాలయ దర్శనాలు. సంఘంలో గౌరవమర్యాదలు. ప్రముఖుల నుంచి కీలక సందేశాలు వస్తాయి.

మీనం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సందేశం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి.

 

మరిన్ని కథనాలు:

rasi phalalu నేటి రాశిఫలాలు

 

 

 

 

 

 

Share This Post