భారత్ సమాచార్ ; ఇంగ్లీష్ మాట్లాడటం, చదవడం, రాయడం, అర్థం చేసుకోవడంలో ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకునేందుకు ఉపయోగపడే టోఫెల్ పరీక్ష రాసే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లోని పేద పిల్లలకు కల్పించనున్నామని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాశ్ నేడు వెల్లడించారు.
ప్రత్యేక శిక్షణా తరగతులు ఏర్పాటు…
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో ఇంగ్లీష్ పై పట్టు పెంపొందించాలనే ఉద్దేశంతో మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణా తరగతులను నిర్వహించనుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిదవ తరగతి చదివే విద్యార్థులకు టోఫెల్ ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు ఇంగ్లీషు పాఠాలు చెప్పడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో మంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సృష్టించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో విద్యార్థులు ఇంగ్లీషులో మాట్లాడేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు.విద్యార్థులు బైజూస్ కంటెంట్ ట్యాబులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. విద్యార్థుల జీవితాల్లో టోఫెల్, బైజూస్ ట్యాబ్ కంటెంట్ ఒక భాగం కావాలన్నారు. ఆంగ్ల భాషపై విద్యార్థులు మక్కువ పెంచుకొని ఇష్టంగా శిక్షణ లో పాల్గొన్నాలని సూచించారు.