August 9, 2025 8:58 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

రైల్వే స్టేషన్‌లో రైలు బోగి దగ్ధం.. త్రుటిలో త‌ప్పిన పెనుప్ర‌మాదం

భార‌త్ స‌మాచార్.నెట్, మహబూబాబాద్: కేసముద్రం రైల్వే స్టేషన్‌లో పార్కింగ్ చేసిన ఒక రైలు బోగిలో శుక్రవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బోగీలో నిద్రిస్తున్న కార్మికులు వెంటనే అప్రమత్తమై బయటకు పరుగులు తీయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మూడో రైల్వే లైన్ నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు ప్రతిరోజూ ఈ బోగీలోనే నిద్రిస్తుంటారు. మంటలను గమనించిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ అప్పటికే బోగి పూర్తిగా కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారా? అనే కోణంలో రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

కుక్క అడ్డు రావడంతో ఆటో బోల్తా.. ఉపాధ్యాయురాలు మృతి

Share This Post