Homemain slidesత్రివిక్రమ్, వెంకీ, నాని కాంబో.. కామెడీకి ‘జంబో’ ప్యాక్

త్రివిక్రమ్, వెంకీ, నాని కాంబో.. కామెడీకి ‘జంబో’ ప్యాక్

భారత్ సమాచార్, సినీ టాక్స్ : ప్రస్తుతం త్రివిక్రమ్ మహేశ్ మూవీ ‘గుంటూరు కారం’ ఫైనల్ షెడ్యూల్స్ తో బిజీబిజీగా ఉన్నారు. జనవరి 12న ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుంది. ఇక సంక్రాంతి దాకా ఆయన ఫుల్ బిజీనే అనిచెప్పాలి. ఇక పండుగ తర్వాత అల్లు అర్జున్ తో హారిక హాసిని సంస్థ ఓ మూవీని ప్రకటించింది. అయితే బన్నీ పుష్ప-2తో తీరిక లేకుండా ఉన్నారు. త్రివిక్రమ్ తో చేసే సినిమాకు కాస్త సమయం కావాలని కోరారట. దీంతో త్రివిక్రమ్ తన ప్లాన్ బీతో ముందుకొస్తున్నారు. ఈ గ్యాప్ లో ఓ మల్టీస్టారర్ తీద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఇది ఎప్పటి నుంచో చర్చల్లో ఉన్నా.. ఇప్పటికీ సమయం దొరికిందట. అది విక్టరీ వెంకటేశ్ తో మూవీ అట.

వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ రైటర్ గా వచ్చిన ‘నువ్వు నాకు నచ్చవ్’, ‘మల్లీశ్వరీ’ పెద్ద హిట్లుగా నిలిచాయి. వెంకటేశ్ కెరీర్ లోనే ‘నువ్వు నాకు నచ్చవ్’ గుర్తుండిపోయే మూవీ. ఈ సినిమా ఇప్పటికీ టీవీల్లో వచ్చినా జనాలు ఎంజాయ్ చేస్తుంటారు. ఈ సినిమాను ఒక్కొక్కరు పది, ఇరవై సార్లు చూసుంటారు. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమాల్లో ఇది ఒకటి. ఈ మూవీతోనే త్రివిక్రమ్ కు స్టార్ రైటర్ గా పేరొచ్చింది. ఇక వెంకీతో దర్శకుడిగా త్రివిక్రమ్ మూవీ చేస్తుండడంతో జనాల్లో ఆసక్తినెలకొంది. మరో ‘నువ్వు నాకు నచ్చవ్’ లాంటి మూవీ అవుతుందని అంటున్నారు.

ఈ మూవీ ఫ్యామిలీ డ్రామాగా ఉండబోతుందట. ఇందులో ఒక్క వెంకటేశ్ మాత్రమే కాదు నేచురల్ స్టార్ నాని కూడా నటించబోతున్నారట. ఈ ముగ్గురి కాంబినేషన్ లో మూవీ అంటే అంచనాలు భారీగానే ఉంటాయి. జనాలకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అనే చెప్పుకొవాలి. కామెడీని పంచడంలో వెంకటేశ్, నాని చెలరేగిపోతారు. ఇక త్రివిక్రమ్ పంచ్ డైలాగ్ లకు ఇక వీరికి హద్దు ఉంటుందా అని ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.

మరికొన్ని సినీ విశేషాలు…

వెండితెర హాస్య బ్రహ్మను చేస్తే కనీసం…

RELATED ARTICLES

Most Popular

Recent Comments