Homebreaking updates newsత్రివిక్రమ్ నెక్ట్స్ మూవీ ఎవరితో?.. ఆ హీరోలు ఛాన్స్ ఇస్తారా?

త్రివిక్రమ్ నెక్ట్స్ మూవీ ఎవరితో?.. ఆ హీరోలు ఛాన్స్ ఇస్తారా?

భారత్ సమాచార్, సినీ టాక్స్ : రచయితగా కెరీర్ ప్రారంభించిన త్రివిక్రమ్ అనతికాలంలోనే మంచి పేరు సాధించారు. ఆ తర్వాత ‘నువ్వే నువ్వే’తో దర్శకుడిగా మారారు. ఆతర్వాత అతడు, జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, అల వైకుంఠాపురం వంటి సూపర్ డూపర్ హిట్లతో టాప్ డైరెక్టర్ గా ఎదిగారు. ప్రతీ స్టార్ హీరోకు త్రివిక్రమ్ ఓ సినిమా చేయాలని అనుకునేవారు.

ఇక చాలా గ్యాప్ తర్వాత మాటల మాంత్రికుడి దర్శకత్వంలో తాజాగా వచ్చిన మహేశ్ మూవీ ‘గుంటూరు కారం’ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. పాటలు, మహేశ్ మాస్ లుక్స్, డ్యాన్స్ లు, డైలాగ్ లు ఆడియన్స్ ఆకట్టుకున్నా రోటిన్ కథ కావడంతో త్రివిక్రమ్ పై ఫ్యాన్స్ తో ఫైర్ అయ్యారు. నాలుగైదు కథలను రుబ్బి..ఏదో సెంటిమెంట్ యాడ్ చేస్తూ పాత చింతకాయ పచ్చడి కథలతో మేనేజ్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో త్రివిక్రమ్ ను విపరీతంగా ట్రోల్ చేశారు.

దీంతో త్రివిక్రమ్ మనస్తాపం చెందినట్టు కనిపిస్తోంది. ఇక తర్వాత సినిమాతో ఎవరితో చేస్తున్నారు? అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. ఇప్పుడిదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎన్టీఆర్ తో ‘‘అయినను పోయిరావలెను హస్తినకు’’ అనే సినిమాను త్రివిక్రమ్ ప్రకటించారు. కానీ, ఈ చిత్రం కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ లో త్రివిక్రమ్ కు ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చే పరిస్థితి కనపడడం లేదు.

ప్రస్తుతం అల్లు అర్జున్, రామ్, నానిలపై త్రివిక్రమ్ కన్నేశారని ఫిల్మ్ నగర్ టాక్. అంతే కాకుండా తమిళ నటుడు సూర్య సైతం త్రివిక్రమ్ లైన్ లో ఉన్నారని అంటున్నారు. మరి త్రివిక్రమ్ తన తర్వాతి ప్రాజెక్ట్ ను ఎవరితో చేస్తాడో కొద్ది రోజుల పాటు ఎదురుచూడక తప్పదు.

ఇదిలా ఉండగా.. త్రివిక్రమ్ వచ్చే సినిమా అయినా కొత్త జానర్ తో రావాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు. ఎప్పటికీ అదే సెంటిమెంట్ మూస కథలు కాకుండా.. తన తోటి డైరెక్టర్లు చేస్తున్న వైవిధ్య భరిత కథలను ఎన్నుకోవాలని సూచిస్తున్నారు.

మరికొన్ని సినీ సంగతులు…

అతడే సంజయ్ లీలా భన్సాలీ…

RELATED ARTICLES

Most Popular

Recent Comments