Homemain slidesనలుగురిని ట్రై చేసి ఒక్కరిని సెలక్ట్ చేసుకోవాలి

నలుగురిని ట్రై చేసి ఒక్కరిని సెలక్ట్ చేసుకోవాలి

భారత్ సమాచార్, సినీ టాక్స్ : హీరోయిన్ కావాలనుకున్నా యువతులకు బాలీవుడ్ ఒక లైఫ్ టైం టార్గెట్ లాంటిది. ఎందుకంటే బాలీవుడ్ లో ఒక్క చాన్స్ వచ్చిందంటే చాలు కోట్లలో డబ్బు అందుతుంది, వెండితెర అందగత్తెగా సొసైటీ లో బోలేడు క్రేజ్. అందుకే ఏ భామ కూడా ఆ అవకాశాన్ని వదులుకోటానికి అస్సలు ఇష్టపడదు. బాలీవుడ్ లో అలాంటి అవకాశాలకోసం ఎంతైనా కష్టపడతారు, తమ పరువాలన్నీ ఆరబోస్తారు. దీపికా పడుకొనే కూడా తన సినీ కెరీర్ మొదట్లో చాలానే కష్టపడింది. ఈ క్రమంలో నలుగురైదుగురితో డేటింగ్ కూడా చేసిందని హిందీ ఫిల్మ్ నగర్ లో టాక్. తర్వాత రణవీర్ సింగ్ ను పెళ్లి చేసుకుంది.

తాజాగా బాలీవుడ్ లో కరణ్ జోహార్ ప్రముఖ ఇంటర్వ్యు షో ‘కాఫీ విత్ కరణ్’ లో దీపికా పడుకొనే, రణవీర్ సింగ్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన పర్సనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను దీపికా ఇక్కడ పంచుకుంది.  నలుగురైదుగురితో డేటింగ్ చేసిన అనుభవాలతో కొన్ని రోజులు సింగిల్ గా ఉండాలని నిశ్చయించుకుందట. ఆ తర్వాత రణవీర్ ప్రపోజ్ చేయడంతో అతడితో ప్రేమ, ఆ తర్వాత వివాహం జరిగిందని వెల్లడించింది. ప్రస్తుతం తన భర్త రణబీర్, టీంఇండియా మాజీ కెప్టెన్ ధోనీ, స్పెషల్ ఆల్ రౌండర్ యువరాజ్, ప్రముఖ పారిశ్రామివ వేత్త విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యా లతో కొద్ది రోజులు డేటింగ్ చేసినట్టు చెప్పుకొచ్చింది. ఈ మాటలు నెట్టింట కూడా వెంటనే వైరల్ అయ్యాయి.  అయితే ఆమె మాటలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్తున్నారు. ఇదే విషయంపై అక్షయ్ కుమార్ భార్య, బాలీవుడ్ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా కూడా స్పందిస్తూ ట్వీట్టర్ లో ఓ పోస్ట్ ను పంచుకుంది.

‘‘పెళ్లికి ముందు కుక్కలు, చెట్లతో పెళ్లి చేస్తే ఏమి రాదు. ఈ కల్చర్ వదిలేసి దీపిక లాగా ఇద్దరు, ముగ్గురిని ట్రై చేసి, ఫైనల్ గా ఒకరిని సెలక్ట్ చేసుకుంటే బెటర్’’ అని తన అభిప్రాయాన్ని పంచుకుంది. అయితే ఏమైందో ఏమోగాని కొద్దిసేపటికే ఆ పోస్టును ట్వింకిల్ ఖన్నా డిలీట్ చేసింది. ఈ లోగా నెటిజన్లు దాన్ని స్రీన్ షాట్ తీసి వైరల్ చేసేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments