HomeUncategorizedటీఎస్పీఎస్సీ పరీక్షలు ఆలస్యం?

టీఎస్పీఎస్సీ పరీక్షలు ఆలస్యం?

భారత్ సమాచార్, బాజ్స్ అడ్డా : టీఎస్పీఎస్సీ పరీక్షలు ఆలస్యం కానున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. బోర్డు ప్రక్షాళనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పాటు మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టుగా జాబ్ క్యాలెండర్ ను ఫాలో కావాలని అనుకుంటోంది. దీంతో గ్రూప్స్, ఇతర పరీక్షలు మే తర్వాతనే ఉండే అవకాశం కనిపిస్తోంది. బోర్డు చైర్మన్, సభ్యులు రాజీనామా ఆమోదం.. కొత్త బోర్డు ఏర్పాటుకు ఎన్ని రోజుల టైం తీసుకుంటుందో చెప్పలేని పరిస్థితి ఉంది. ఒక వేళ ప్రభుత్వం వేగిరంగా కొత్త బోర్డు ఏర్పాటుకు పూనుకుంటే ఈ నెల చివరిలోగా కొత్త బోర్డు కొలువుదీరనుంది. ఆధునాతన సాంకేతిక, మ్యాన్ పవర్ సమకూర్చడానికి మరికొంత సమయం తీసుకోనుంది. ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసి మ్యానిఫెస్టోలో చెప్పినట్టుగా ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

ఇదిలా ఉండగా గ్రూప్-1 ప్రిలిమ్స్ కేసు సుప్రీంకోర్టులో ఉండడంతో దానిపై ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కేసును విత్ డ్రా తీసుకుని ఫిబ్రవరి 1న అనుబంధ నోటిఫికేషన్ ఇస్తారో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. లేకుంటే సుప్రీంకోర్టులో వాదనలు వినిపించి కేసు నెగ్గేలా చేస్తారా చూడాలి. ఫిబ్రవరిల 1 నోటిఫికేషన్ ఇస్తే కొత్త వారికి అవకాశం ఇచ్చి అప్లికేషన్ ప్రాసెస్ కు నెల రోజుల సమయం ఇవ్వాలి. ప్రిపరేషన్ మూడు నెలల టైం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ప్రిలిమ్స్ మేలో ఆ తర్వాత నెలకు రిజల్ట్.. ఆ తర్వాత 3లేదా 4 నెలల సమయం ఇచ్చి మెయిన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. అంటే మెయిన్స్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఉండొచ్చు. ఒకవేళ సుప్రీం కోర్టు ప్రిలిమ్స్ ఒకే అని డిసెంబర్ చివరి కల్లా తీర్పు ఇస్తే మాత్రం ఏప్రిల్ మొదటివారంలో లేదా జూన్ లో మెయిన్స్ నిర్వహించవచ్చు.

ఏప్రిల్ రెండో వారం తర్వాత, మేలో ఎన్నికలు ఉండడంతో అప్పుడు పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవచ్చు. ఇక గ్రూప్-2 రీషెడ్యూల్ చేస్తామంటున్నారు. కానీ ప్రస్తుత నోటిఫికేషన్ కొనసాగిస్తారా? లేదంటే ఇదే నోటిఫికేషన్ కు ఏప్రిల్ 1న అనుబంధ నోటిఫికేషన్ లో మరిన్న పోస్టులు కలిపి కొత్త డేట్లు ప్రకటిస్తారా చెప్పలేదు. ఒకవేళ ఏప్రిల్ 1న నోటిఫికేషన్ ఇస్తే ఈ జులై లేదా ఆగస్టులో ఉండే అవకాశం ఉంటుంది. గ్రూప్-3ని జూన్ 1న ఇస్తామని చెప్పారు. అంటే సెప్టెంబర్ లో పెట్టే అవకాశం ఉంటుంది. గ్రూప్ -4 కూడా సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో పెట్టే పరిస్థితి ఉంది. ఏ రకంగా చూసినా.. నిరుద్యోగులు 2024 మొత్తం ప్రిపరేషన్ లో ఉండే పరిస్థితే కనిపిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments