July 28, 2025 6:17 pm

Email : bharathsamachar123@gmail.com

BS

TTD: శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన వసతులు

భారత్ సమాచార్.నెట్, తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన వసతులు కల్పిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు ఎక్కువ సమయం వేచి చూడకుండా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో వచ్చే భక్తులకు మరింత మెరుగైన వసతులు కల్పిస్తామన్నారు. అలాగే వసతి గదుల కోసం వేచి ఉండే భక్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయనున్నట్లు తెలిపారు.

అలాగే ఒంటిమిట్ట రామాలయంలో అన్నప్రసాద వితరణ కోసం రూ.4.35 కోట్ల నిధులను కేటాయించినట్లు చెప్పారు. వచ్చే నెల నుంచి రోజుకు మూడుసార్లు భక్తుల కోసం అన్నప్రసాదాన్ని పంపిణీ చేస్తామని బీఆర్ నాయుడు పేర్కొన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశమైంది. ఈ సమావేశంలో పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాకు వివరించారు.

ఇక వీటితో పాటు టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయాలు ఇవే:

– తిరుమలలో అన్ని కార్యాలయాలు ఒకే సముదాయంలో ఉండేలా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ నిర్మాణం
– టీటీడీలో 142 మంది కాంట్రాక్టు డ్రైవర్ల క్రమబద్ధీకరణ.. ప్రభుత్వ ఆమోదానికి పంపేందుకు నిర్ణయం
– కొత్తగా 700 వేద పారాయణదారులు ఉద్యోగాల కల్పన
– ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన ప్రాంతాల్లో మూడు కేటగిరీల్లో భజన మందిరాల నిర్మాణం కోసం నిధులు విడుదల చేయనున్న శ్రీవాణి ట్రస్ట్
– దేవాదాయ శాఖ సిఫారసుతో 600 మందికి నెలకు రూ. 3 వేల భృతి
– కడపలోని పురాతన శివాలయం అభివృద్ధికి నిధులు మంజూరు

Share This Post
error: Content is protected !!