July 28, 2025 12:24 pm

Email : bharathsamachar123@gmail.com

BS

Thulasichandu ఓ యూబ్యూట్ నిర్వాహకుడికి తులసిచందు స్ట్రాంగ్ వార్నింగ్

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: సమాజంలో నిజాన్ని నిర్భయంగా చెప్పడం తప్పా ?, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడం నేరమా ?, ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్‌గా చెప్పే జర్నలిజాన్ని ఎవరి కిందో తాకట్టు పెట్టడమే నిజమైన జర్నలిజమా ?. పాలకులు ఎన్నికల ముందు ఏం చెప్పారు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు, జనం ఏం కోరుకుంటున్నారు, ప్రజాసమస్యల పరిష్కారం దిశగా ఎవరు నడవాలి, ప్రభుత్వాన్ని ఎవరు అడగాలి ?, పాలకులను ఎవరు నిలదీయ్యాలి. నిజాన్ని చెప్తే అంత అసహనం ఎందుకు, ప్రశ్నించే జర్నలిస్టులపై అంత అక్కసు ఎందుకు ?, నిబద్దత కలిగిన జర్నలిస్టులపై అంత ద్వేషం ఎందుకు, నిజానికి జర్నలిస్టులు ఏం చెప్పారో ఒక్కసారైన మనం ప్రశ్నించుకున్నామా లేదా ఎవరో ఫేక్ ప్రచారం చేస్తుంటే మనం కూడా ఆ ఊబిలో పడి అసత్యాన్నే నిజంగా నమ్ముతున్నామా అని ఎప్పుడైనా ఆత్మసమీక్ష మనం చేసుకున్నామా ? కానీ ఇప్పుడు చేసుకోవాల్సిన సమయం వచ్చింది. సమాజ హితం కోసం పాటుపడే నిబద్ధత గల జర్నలిస్టులను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేసే సమయం ఆసన్నమైంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే జర్నలిస్టులకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది.

రెచ్చగొట్టే వారిపై చర్యలు తీసుకోవాలి:

ప్రస్తుత డిజిటల్ యుగంలో కొందరు సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడుతున్నారు. ఇంకొందరు హద్దులుదాటి వ్యవహరిస్తున్నారు. మరికొందరు మతం ముసుగులో సామాన్య ప్రజలను రెచ్చగొట్టే వీడియోలు తమ యూట్యూబ్‌‌ ఛానెళ్లలో అప్లోడ్ చేస్తున్నారు. ఇంకొందరు తమ యూట్యూబ్‌ ఛానెళ్లలో వ్యూస్ కోసం, సబ్స్‌క్రైబర్స్ కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో నిత్యం ద్వేషాన్ని రగిల్చి కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారిగా రెచ్చగొట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వారి ఫాలోవర్స్ కూడా వెనుక ముందు చూడాకుండా, ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకోకుండా సోషల్ మీడియాలో తమకు ఇష్టం వచ్చినట్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రజలను రెచ్చగొట్టి తప్పదొవ పట్టించే ఇలాంటి యూట్యూబ్ ఛానెళ్ల నిర్వాహకులపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. సమాజహితం కోసం పనిచేసే నిజాయితీ గల యూట్యూబ్ ఛానెళ్ల నిర్వాహకులకు అండగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది.

 

అసత్య ప్రచారాన్ని అడ్డుకోవాలి.. ప్రశ్నించే గొంతుకలకు అండగా నిలవాలి:

ప్రముఖ జర్నలిస్ట్ తులసి చందుపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ప్రతిఒక్కరూ ఖండించాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వ అసమర్థ పాలనపై ప్రశ్నిస్తూ నిరంతరం ప్రజాసమస్యల పరిష్కారం కోసం పరితపించే నిఖార్సైన మహిళ జర్నలిస్టుపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారం దురదృష్టకరం. కొందరు మతం ముసుగులో తులసి చందుపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి. పాకిస్థాన్‌తో భారత్ యుద్ధం చేయాల్సిన అవసరం లేదని తులసి చందుపై ఓ యూట్యూబ్ నిర్వాహకుడు చేసిన తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలి. నిజాన్ని నిర్భయంగా చెప్పే జర్నలిస్టులపై కొంతమంది చేసే ఈ దుశ్చర్యల వల్ల సమాజాన్ని తప్పుదోవ పట్టించడమే తప్పా ఇంకొకటి కాదని గ్రహించాలి. సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రతీ ఒక్కరూ డిమాండ్ చేయాలి. తులసి చందుపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండించి డెమోక్రసీలో నాల్గో స్తంభమైన జర్నలిజాన్ని బతికించుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి.

నోట్: ప్రముఖ జర్నలిస్ట్ తులసి చందుపై జరుగుతున్న అసత్య ప్రచారంపై నిజనిజాలు తెలుసుకునేందుకు ఈ కింది వీడియోను చూడండి.

Share This Post
error: Content is protected !!