August 2, 2025 9:22 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

Union Govt: అమెరికాపై ఎలాంటి ప్రతీకారం తీర్చుకోం: కేంద్రం

భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: భారత్ తమ మిత్ర దేశమని చెప్పుకుంటూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై 25 శాతం సుంకాలు విధించింది. దీనిపై కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతీకార చర్యలు తీసుకుంటుదన్న ఊహాగానాల నడుమ కేంద్రం స్పందించింది. ఇరు దేశాల ప్రయోజనాలకు అనుగుణంగా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరిస్తామని.. ట్రంప్ విధించిన టారిఫ్‌లపై భారత్ ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోదని స్పష్టం చేసింది.

 

ట్రంప్ టారిఫ్‌లపై భారత్ మౌనమే ఇందుకు సరైన సమాధానమని పేర్కొంది. అమెరికా టారిఫ్‌ల మోతకు భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే వార్తలను కొట్టిపడేసింది కేంద్రం. అమెరికా విధించిన సుంకాలు భారత్ ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు హెచ్చరించగా.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. భారత్ ఆర్థిక వ్యవస్థ గతంలో కంటే ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పింది.

 

అదేవిధంగా ఈ విషయంలో ఇంకా ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని.. ఇరు దేశాలకు ప్రయోజనం కలిగేలా నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. కాగా, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని ట్రంప్ జీర్ణించుకోలేక భారత్‌పై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ట్రంపే స్వయంగా ప్రకటించారు. రష్యాతో భారత్ ఎలాంటి ఒప్పందం చేసుకున్న తనకు సంబంధం లేదన్నారు.

Share This Post