భారత్ సమాచార్.నెట్: కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో కేంద్రం రంగంలోకి దిగింది. నిమిష ప్రియ కేసు సున్నితమైన అంశమని.. ఆమెను మరణశిక్ష నుంచి తప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత్ తరఫున నిమిష ప్రియకు అన్నివిధాలుగా సాయం అందిస్తున్నామని పేర్కొంది. యెమెన్ దేశస్థుడిని హత్య చేసిన కేసులో అక్కడి చట్టాల ప్రకారం ఆమెకు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే.
నిజానికి ఈ నెల 16నే నిమిష ప్రియను ఉరి తీయాల్సి ఉండగా.. యెమెన్ ప్రభుత్వం ఆ శిక్షను తాత్కాలింగా వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే భారత్ విదేశాంగ శాఖ స్పందించింది. నిమిష ప్రియ కేసు పరిష్కారం కోసం భారత్‌తో స్నేహపూర్వకంగా ఉన్న దేశాలతో టచ్ ఉన్నట్లు చెప్పింది. ఈ వ్యవహారాన్ని చాలా దగ్గర నుంచి పర్యవేక్షిస్తున్నామని.. అన్ని రకాల సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది.
ఇకపోతే 2008లో ఉపాధి కోసం యెమెన్ వెళ్లిన నిమిష ప్రియ.. అక్కడే ఓ క్లినిక్ ఓపెన్ చేసింది. తన వ్యాపార భాగస్వామి మెహదీతో విభేదాలు తలెత్తడంతో.. మత్తు ఇన్‌జెక్షన్ ఇచ్చింది. దీంతో డోస్ ఎక్కువ అయ్యి అతడి మరణించాడు. దీంతో అక్కడి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోగా.. అక్కడి చట్టాల ప్రకారం కోర్టు శిక్ష విధించింది. అయితే నిమిష ప్రియకు క్షమాభిక్ష మంజూరు చేయాలని అందుకు బదులుగా నష్టపరిహారం తీసుకోవాలని మెహదీ కుటుంబాని కోరగా.. చేసిన నేరానికి నిమిష ప్రియకు శిక్ష విధించాలని డిమాండ్ చేస్తోంది.
Share This Post