August 4, 2025 8:00 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

Revanth Govt: మెగా కోడలికి.. రేవంత్ సర్కార్ కీలక బాధ్యతలు

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: మెగా ఫ్యామిలీ కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు తెలంగాణ సర్కార్ కీలక బాధ్యతలు అప్పగించింది. రేవంత్ ప్రభుత్వం ఇటీవల కొత్త స్పోర్ట్స్ పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ బోర్డును ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక బోర్డు ఛైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త సంజయ్ గోయెంకాను నియమించగా.. కో ఛైర్మన్‌గా ఉపాసన కొణిదెలను నియమించింది ప్రభుత్వం.

 

ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తనకు అప్పగించినట్ల బాధ్యతలపై ఉపాసన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. పోస్ట్ పెట్టారు. స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణకు తనను కో ఛైర్మన్‌గా నియమించడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ నియామకం తనకు ఎంతో గౌరవాన్ని ఇచ్చిందని చెబుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఉపాసన. అలాగే సంజీవ్ గోయెంకాతో కలిసి పనిచేసే అవకాశం రావటం మరింత గౌరవంగా భావిస్తున్నానని ఉపాసన రాసుకొచ్చారు.

 

ఇక ఈ స్పోర్టస్ హబ్ ఆఫ్ తెలంగాణ బోర్డులో సభ్యులుగా సన్ టీవీ నెటవర్క్, సన్ రైజర్స్ హైదరాబాద్ యజమానీ కావ్యా మారన్, క్రికెటర్ కపిల్ దేవ్, పుల్లెల గోపిచంద్, రవికాంత్ రెడ్డి, అభినవ్ బింద్రా, భూటియా తదితరులను నియమించింది. కాగా క్రీడల్లో దేశానికే తెలంగాణను రోల్ మాడల్‌గా నిలపాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. అందుకే మంచి క్రీడాకారులను తయారు చేయాలన్న లక్ష్యంతో ఈ పాలసీని తెచ్చింది రేవంత్ ప్రభుత్వం.

Share This Post